మణిరత్నం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేయాలని హీరోలందరూ ఆశపడుతుంటారు. కానీ తెలుగులో ఆయన స్ట్రెయిట్ సినిమాలు పెద్దగా తీయలేదు. అప్పుడెప్పుడో నాగార్జునతో ‘గీతాంజలి’ సినిమా తీశారు. ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటారు. ఆ తరువాత ఆయన ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా డైరెక్ట్ చేయలేదు. మణిరత్నంని అభిమానించే మన హీరోలు ఆయనకు డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు.
ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవనో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ తెలుగు హీరోలు మాత్రం మణిరత్నంతో సినిమా అంటే వెనుకడుగు వేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో మణిరత్నం ఓ కథ పట్టుకొని టాలీవుడ్ స్టార్ హీరోల చుట్టూ తిరిగారు. కానీ మనవాళ్లు మాత్రం ముందుకు రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశారు మణిరత్నం. వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై స్పందించారు మణిరత్నం. మహేష్ ని కలిసిన మాట నిజమేనని.. ఆయనతో సినిమా కూడా చేయాలనుకున్నానని మణిరత్నం చెప్పారు. ఆయనతో కథా చర్చలు జరిగాయని.. కానీ కుదరలేదని అన్నారు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని చెప్పారు. నాగచైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలను కూడా మణిరత్నం సంప్రదించారు. కాయి వాళ్లు కూడా నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం ‘నవరస’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దీనికి ఆయన నిర్మాత మాత్రమే. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on July 9, 2021 11:30 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…