పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఆ విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగడం లేదు.
దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాదనే వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ నిర్మాత ఏ ఎమ్ రత్నం స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా అనుకున్న టైమ్ కి వచ్చి తీరుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ముందుగా ‘ఏకే’ రీమేక్ ను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
ఈ విషయమై దర్శకుడు క్రిష్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రెండు చిత్రాల దర్శకనిర్మాతలు ఒక మాట మీదకు రావడంతో ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమాను వాయిదా వేయనున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన పోస్ట్ ప్రొడక్షన్ కు, వీఎఫ్ఎక్స్ కు కావాల్సినంత సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. కాబట్టి వచ్చే సంక్రాంతికి ‘హరిహర వీరమల్లు’ రాకపోయినా.. ‘ఏకే’ రీమేక్ మాత్రం రెడీగా ఉంటుందని తెలుస్తోంది.
This post was last modified on July 8, 2021 2:46 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…