కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి బాగానే తగ్గింది. దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య 35 వేలకు పడిపోయింది. గత వంద రోజుల్లో ఎన్నడూ ఇంత తక్కువ కేసులు నమోదు కాలేదు. దీంతో నార్మల్సీ వచ్చేసినట్లే అని అంతా భావిస్తున్నారు. అన్ని రకాల వ్యాపారాలు, కార్యకలాపాలు ఒకప్పట్లా కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ టైంలో మాదిరే చివరగా పున:ప్రారంభం కానున్నది థియేటర్ ఇండస్ట్రీనే. దేశవ్యాప్తంగా నెమ్మదిగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి కొన్ని రోజుల్లోనే వెండి తెరల్లో వెలుగులు నిండబోతున్నాయి.
ఐతే థియేటర్లు తెరుచుకున్న వెంటనే కొత్త సినిమాలు ఆడే పరిస్థితి అయితే లేదు. వారం లేదా రెండు వారాలు ఆగాల్సిందే. ట్రయల్ రన్ కింద పాత సినిమాలు నడిపించి.. ఆ తర్వాత కొత్త చిత్రాలు రిలీజ్ చేయబోతున్నారు.
థియేటర్ల పున:ప్రారంభం తర్వాత కొత్త చిత్రాలను విడుదల చేయడంలో కొంచెం రిస్క్ ఉంది. అదే సమయంలో అది అడ్వాంటేజ్ కూడా కావచ్చు. ప్రేక్షకులు వెంటనే థియేటర్లకు రాకపోతే సినిమా అన్యాయం అయిపోతుంది. అదే సమయంలో గత ఏడాది పోస్ట్ కరోనా ఫస్ట్ రిలీజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’కు కంటెంట్‌తో సంబంధం లేకుండా మంచి ఫలితం దక్కింది. మరి ఫస్ట్ కాపీలతో రెడీగా ఉన్న లవ్ స్టోరి, టక్ జగదీష్ లాంటి చిత్రాలు ధైర్యం చేస్తాయేమో చూడాలి. ఐతే ముందు ఒకట్రెండు చిన్న సినిమాలే విడుదల కావచ్చని.. ఆ తర్వాత ఈ సినిమాలు బరిలోకి దిగొచ్చని అంటున్నారు.
ముందు అనుకున్నట్లే కిరణ్ అబ్బవరం చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఆగస్టు 3న రిలీజవుతుందని.. ఈ లోపు వేరే సినిమాలు రాకుంటే అదే పోస్ట్ సెకండ్ వేవ్ నోటెడ్ రిలీజ్ కావచ్చని అంటున్నారు. సెకండ్ వేవ్‌కు ముందు విడుదలకు రెడీ అయి ఆగిపోయిన తేజ సజ్జా సినిమా ‘ఇష్క్’ కూడా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి దిగుదామా అని చూస్తోంది. ఇలాంటి చిన్న సినిమాలు రెండు మూడు పడ్డాక థియేటర్లు ఊపందుకుంటే లవ్ స్టోరి, టక్ జగదీష్ రేసులోకి రావచ్చు. ఆ రెండు చిత్రాలూ ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని భావిస్తున్నారు.
This post was last modified on July 7, 2021 10:52 am
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…