మనోజ్ బాజ్‌పేయి పేరెత్తితే ఇప్పుడందరికీ ‘ఫ్యామిలీ మ్యాన్’ గుర్తుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్‌తో అతడికెంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సిరీస్ ఇది. ఇందులో శ్రీకాంత్ తివారిగా మనోజ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సిరీస్ కంటే ముందు మనోజ్‌కు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది, నటుడిగా అతనేంటో చాటిచెప్పింది ‘సత్య’ సినిమాలోని బీకూ మాత్రే పాత్ర.
90ల చివర్లో వచ్చిన ఈ రామ్ గోపాల్ వర్మ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఆ చిత్రంలో ఆర్టిస్టులందరూ అద్భుతంగా చేసినా.. మనోజ్ నటన మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ సినిమాతో రాత్రికి రాత్రి మనోజ్ జీవితం మారిపోయింది. ఇక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. బీకూ మాత్రే పాత్రకు అతను జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా అందుకోవడం విశేషం.
ఐతే ‘సత్య’లో నటించడానికి ముందు మనోజ్ చాలా కష్టాలే పడ్డాడట. చిన్న పాత్ర ఇచ్చినా చాలని దర్శకుల వెనుక తిరిగేవాడట. ‘స్వాభిమాన్’ సీరియల్‌తో కాస్త నిలదొక్కుకుంటున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ ‘దౌడ్’ సినిమాలో చిన్న పాత్ర ఆఫర్ చేశాడని.. ఆ పాత్ర కోసం వెళ్లినపుడు తాను నటించిన సినిమాల గురించి అడిగాడని.. శేఖర్ కపూర్ దర్శకత్వంలో ‘బండిట్ క్వీన్’లో నటించానని చెప్పగా.. అందులో బందిపోటు మాన్ సింగ్ పాత్ర చేసింది తానే అని తెలుసుకుని.. “నీకు ఇంత చిన్న పాత్ర కరెక్ట్ కాదు. వేరే పాత్ర ఇస్తా” అని వర్మ అంటే.. ‘దౌడ్’లో నటించకపోతే పాతికవేలు పారితోషకం పోతుందంటూ వర్మ దగ్గర బాధ పడ్డానని.. దీంతో వర్మ గట్టిగా నవ్వేసి ఆ పాత్రలో నటింపజేశాడని.. తర్వాత హామీ ఇచ్చినట్లే ‘సత్య’లో బీకూ మాత్రే క్యారెక్టర్ చేయించాడని.. ఆ పాత్రతో తన దశ తిరిగిందని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత ఓ థియేటర్‌కు వెళ్తే జనాలు తన చుట్టూ పెద్ద ఎత్తున మూగడంతో ఊపిరాడలేదని.. సెక్యూరిటీ వాళ్లు తనను చేతులపైకి ఎత్తుకుని మోసుకుంటూ అక్కడి నుంచి తప్పించాల్సి వచ్చిందని.. ఆ దృశ్యం చూసి తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని మనోజ్ చెప్పుకొచ్చాడు.
This post was last modified on July 4, 2021 2:48 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…