సౌత్ ఇండియాలో హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన వాళ్లు చాలా తక్కువమంది. వారిలో అనుష్క ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సరసన భారీ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి చిత్రాలు ఆమె సత్తాను చాటి చెప్పాయి. ఐతే గత కొన్నేళ్లలో అనుష్క మరీ సెలక్టివ్‌గా, తక్కువగా సినిమాలు చేస్తోంది.
‘బాహుబలి’ తర్వాత ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ సినిమాల్లో మాత్రమే నటించింది. వీటి మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చింది. గత ఏడాది ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క పేరే వినిపించలేదు. ఆమె కొత్త చిత్రాన్ని ఖరారు చేయడానికి చాలా టైం తీసుకుంది. ఎట్టకేలకు తన మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్‌లో ఓ సినిమా మొదలు పెట్టడానికి ఆమె సిద్ధమైంది. ఇందులో నవీన్ పొలిశెట్టి కీలకపాత్ర చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
అనుష్క-నవీన్ కలయిక కచ్చితంగా ఆసక్తి రేకెత్తించేదే. కాగా ఈ చిత్రంలో మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంటుందట. ఇందులో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడట. దాని నిడివి తక్కువే ఉంటుందట కానీ.. స్పెషల్‌గా ఉంటుందని అంటున్నారు. ఇంతకుముందు ‘మహానటి’లో విజయ్ చేసిన పాత్ర ఎలా హైలైట్ అయిందో తెలిసిందే. ఈ మధ్యే ‘జాతిరత్నాలు’లోనూ అతను కొన్ని క్షణాల పాటు మెరిశాడు.
మరి అనుష్క-నవీన్ సినిమాలో విజయ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు రూపొందించనున్నట్లు సమాచారం. యువి క్రియేషన్స్‌తో అనుష్క అనుబంధం గురించి తెలిసిందే. ఆ సంస్థ తొలి చిత్రం ‘మిర్చి’లో ఆమే హీరోయిన్. ప్రభాస్ లాగే ఆమె కూడా ఈ సంస్థను హోం బేనర్ లాగా ఫీలవుతుంది. ఇదే సంస్థలో ఆమె నటించిన ‘భాగమతి’ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్ చేస్తున్న సినిమా ఇదే అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 4, 2021 12:28 pm
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…