నిర్బయ వెబ్ సిరీస్ … ట్రెండ్ నౌ !

2020 చివర్లో జరిగిన నిర్భయ రేప్ ఉదంతం ఎంతగా సంచలనం రేపిందో.. దేశాన్ని ఏ స్థాయిలో కుదిపేసిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ దారుణం గురించి తెలిసి కదిలిపోయిన దేశ యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చి ఆందోళన నిర్వహించింది. ఇలాంటి దారుణాలకు అడ్డు కట్ట వేసేందుకు నిర్భయ పేరుతో ఒక చట్టం కూడా తెచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆ ఉదంతం దేశంపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులకు ఉరిశిక్ష అమలు చేసే విషయంలో ఎంత ఆలస్యం జరిగిందో.. బాధితురాలి తల్లిదండ్రులు ఎలాంటి మానసిక వేదన అనుభవించారో తెలిసిందే. చివరికి కొన్ని నెలల కిందటే ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష అమలైంది. భారతీయులపై అత్యంత ప్రభావం చూపిన ఈ కేసుపై సమగ్ర అధ్యయనంతో ఇప్పుడో వెబ్ సిరీస్ తెరకెక్కింది. అదే.. ఢిల్లీ క్రైమ్.

నెట్ ఫ్లిక్స్‌లో తాజాగా ఈ వెబ్ సిరీస్‌ను లాంచ్ చేశారు. ఆ రోజు రాత్రి నిర్భయపై దారుణం జరగడానికి ముందు పరిస్థితులేంటి.. ఆ దారుణం ఎలా బయటపడింది.. తర్వాత బాధితురాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది.. తన చివరి మాటలు ఏంటి.. ఆపై నిందితుల్ని కనుగొనేందుకు పోలీసులు ఏం చేశారో.. అందరినీ ఎలా బయటికి లాగారు.. కేసు విచారణ ఎలా సాగింది.. యువత ఎలా రగిలిపోయారో.. నిందితులకు ఉరి శిక్ష అమలులో ఎందుకు జాప్యం జరిగింది.. ఈ విషయంలో రాజకీయాల ప్రమేయం ఏంటి.. చివరికి ఎలా ఉరిశిక్ష అమలైంది.. ఇత్యాది అంశాలన్నింటిపై సమగ్ర పరిశోధనతో ఈ సిరీస్ తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

‘ఢిల్లీ క్రైమ్’కు మంచి రివ్యూలు కూడా వస్తున్నాయి. కొంచెం స్లో అన్న కంప్లైంట్ మినహాయిస్తే సిరీస్ ఉద్వేగభరితంగా, ఉత్కంఠతో సాగుతుందని అంటున్నారు. చూడదగ్గ సిరీస్ ఇదంటున్నారు.