ఈ ఏడాది ఆరంభంలో ‘నాంది’ సివిమా విడుదలవుతుంటే అది హిట్టు కావాలని ఇండస్ట్రీ మొత్తం కోరుకుంది. అలాగే ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ అని లేకుండా అందరూ కూడా ‘నాంది’ బాగా ఆడాలని ఆశించారు. అందుక్కారణం.. అల్లరి నరేష్. ఒకప్పుడు తన కామెడీ చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులనూ కడుపుబ్బ నవ్వించిన నరేష్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
ఒకప్పుడు బాగా నవ్వించాడన్న అభిమానానికి తోడు వ్యక్తిగా కూడా మంచి పేరుండటం వల్ల అందరూ అతడి విజయాన్ని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్లే ‘నాంది’ మంచి విజయం సాధించి అల్లరోడి కెరీర్‌కు ఊపిరులూదింది. ఐతే హిట్టు కొట్టడం కంటే దాన్ని నిలబెట్టుకునేలా తర్వాత మంచి సినిమాలు చేయడం కీలకం. ఐతే ఈ విషయంలో నరేష్ బాగా ఆలోచించి జాగ్రత్తగానే తర్వాతి సినిమాను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. నరేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతడి కొత్త చిత్రాన్ని ప్రకటించారు ఈ రోజు. ఇది ఫస్ట్ ఇంప్రెషన్లోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘సభకు నమస్కారం’ అంటూ ఆకర్షణీయ టైటిల్ పెట్టడమే కాక.. ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఒక పొలిటికల్ మీటింగ్‌లో హీరో మాట్లాడుతున్నట్లు చూపిస్తూ అతడి వెనుక ప్యాంటు జేబుల్లో ఒక వైపు నోట్ల కట్టలు, మరో వైపు మందు సీసా పెట్టారు. దీన్ని బట్టి నరేష్ ఇందులో యువ రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నాడని అర్థమవుతోంది. అంతే కాక ఇదొక పొలిటికల్ సెటైరిక్ ఫిలిం అనే విషయం కూడా తెలుస్తోంది.
తెలుగులో పొలిటికల్ సినిమాలే తక్కువ. అందులోనూ పొలిటికల్ సెటైర్స్ అంటే మరీ అరుదు. సరిగ్గా తీస్తే జనాలు బాగా కనెక్టయ్యే జానర్ ఇది. ఫస్ట్ లుక్ వరకు చూస్తే చిత్ర బృందం బాగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. సతీష్ మల్లంపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బేనర్ మీద ‘సభకు నమస్కారం’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఫస్ట్ లుక్‌కు తగ్గట్లే సినిమా కూడా ఉండి నరేష్‌కు మరో విజయాన్ని ఈ చిత్రం అందిస్తుందేమో చూడాలి.
This post was last modified on June 30, 2021 2:24 pm
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…