టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు కొన్నేళ్లుగా కాలం కలిసి రావట్లేదు. పడి పడి లేచె మనసు, జాను లాంటి డిజాస్టర్లు అతణ్ని వెనక్కి లాగేశాయి. శ్రీకారంతో బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే మంచి టాక్ తెచ్చుకుని కూడా ఆ సినిమా కూడా ఫెయిల్యూర్‌గానే నిలిచింది. ఇప్పుడిక శర్వా, అతడి అభిమానుల ఆశలన్నీ మహాసముద్రం మీదే ఉన్నాయి. ఐతే చడీ చప్పుడు లేకుండా మరో సినిమాను పూర్తి చేసి దాంతోనే ముందుగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు శర్వా.
తమిళంలో మంచి పేరున్న నిర్మాత అయిన ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వా కెరీర్లో తొలిసారిగా పూర్తి స్థాయిలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రమిది. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఒకేసారి రిలీజ్ కూడా చేయబోతున్నారు. ఒకే ఒక్క జీవితం అనే టైటిల్ ఖరారు చేస్తూ ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను వదిలారు.
ఫస్ట్ లుక్ అంటే మామూలుగా హీరోల లుక్సే వదులుతుంటారు. వాళ్లే హైలైట్ అయ్యేలా చూస్తారు. కానీ ఒకే ఒక్క జీవితం ఫస్ట్ లుక్ దానికి భిన్నంగా ఉంది. హీరోను వెనుక నుంచి చూపిస్తూ టైటిల్‌కు తగ్గట్లు సినిమా కథేంటో సూచించేలా ఒక కాన్సెప్ట్‌తో ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. జీవిత చక్రాన్ని చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ కాన్సెప్ట్ పోస్టర్లో ఓవైపు పాత కాలానికి చెందిన ఆడియో క్యాసెట్, ఓవర్ హెడ్ ట్యాంకు, పోస్ట్ కార్డు, గాలిపటాలు తదితరాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపేమో స్మార్ట్ ఫోన్, ఐపాడ్, విమానం, వీడియో గేమ్ లాంటివి దర్శనమిస్తున్నాయి.
దీన్ని బట్టి పాత, కొత్త కాలాల్లో జీవితం ఎలా మార్పు చెందిందో ఈ సినిమాలో చూపించేలా కనిపిస్తోంది. ఇలాంటి జీవిత పాఠాలను హృద్యంగా బోధించే చిత్రాలు ప్రేక్షకులకు బాగానే నచ్చుతాయి. గతంలో శర్వా ఇదే తరహాలో చేసిన గమ్యం, అందరి బంధువయా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తో అంచనాలు రేకెత్తించిన శర్వా.. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
This post was last modified on June 29, 2021 9:10 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…