Movie News

పుష్ప‌-1లో అత‌డికి మూడు సీన్లే

పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒక‌టి పుష్ప‌. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత అల్లు అర్జున్, రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇందులో విల‌న్ పాత్ర‌కు మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్ ఎంపిక కావ‌డం సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచింది.

మ‌ల‌యాళంలో అద్భుత‌మైన పాత్ర‌ల‌తో ఫాహ‌ద్ తిరుగులేని న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ మ‌ధ్య‌ ఓటీటీల్లో ఫాహ‌ద్ సినిమాలు చూస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అత‌డి స్థాయి ఏంటో తెలుస్తోంది. కుంబ‌లంగి నైట్స్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో ఫాహ‌ద్ న‌ట‌న చూసిన వాళ్ల‌కు పుష్ప సినిమాలో సుకుమార్ అత‌ణ్ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. బ‌న్నీతో అత‌డి క‌ల‌యిక‌లో ఎలాంటి సీన్లు ఉంటాయో అన్న ఎగ్జైట్మెంట్ క‌ల‌గ‌డం ఖాయం.

ఐతే పుష్ప‌ను ఈ మ‌ధ్య‌నే రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో అందుకు త‌గ్గ‌ట్లు స్క్రిప్టును మార్చాల్సి వ‌చ్చింది. ఫాహ‌ద్ ఫాజ‌ల్ పాత్ర‌ను బేస్ చేసుకునే ఈ క‌థ‌ను రెండుగా విభిజించినట్లు స‌మాచారం. ఆ పాత్ర‌కు ఫ‌స్ట్ పార్ట్‌లో స్క్రీన్ టైం చాలా త‌క్కువ‌ట‌. రెండో పార్ట్‌కు ఫాహ‌ద్ పాత్ర హైలైట్ అయ్యేలా సెట్ చేశాడ‌ట సుకుమార్. ఫ‌స్ట్ పార్ట్‌లో వేరే హైలైట్లు చాలా ఉండ‌టంతో ఈ పాత్ర‌ను చివ‌రి 20 నిమిషాల్లోనే రంగ ప్ర‌వేశం చేయిస్తున్నాడ‌ట‌.

అంత‌కుముందు వ‌ర‌కు బ‌న్నీకి వేరే విల‌న్ల‌తో వైరం న‌డుస్తుంది. బ‌న్నీ-ఫాహ‌ద్ మ‌ధ్య ర‌స‌వ‌త్త‌రంగా ఉండే ఒక ఫేసాఫ్ సీన్‌తో సినిమాను ముగిస్తార‌ని.. పార్ట్-2లో వీరి మ‌ధ్య ఎత్తులు పైఎత్తుల‌తో క‌థ న‌డుస్తుంద‌ని.. దానికి సంబంధించి క‌థ‌ను మ‌రింత విస్త‌రించి స్క్రిప్టును ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దాల్సి ఉంద‌ని స‌మాచారం. జూన్ మొద‌టి వారంలో పుష్ప కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంద‌ని.. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌తోనే పార్ట్-1 షూటింగ్ దాదాపు అయిపోతుంద‌ని స‌మాచారం. ఫాహ‌ద్ తొలిసారిగా పుష్ప సెట్లో అడుగు పెట్టేది ఈ షెడ్యూల్‌లోనేన‌ట‌.

This post was last modified on June 27, 2021 8:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్యకు ‘జాట్’ ఫార్ములా వద్దు

ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…

23 minutes ago

అధికారికం… పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య కాదు

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…

1 hour ago

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

3 hours ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

3 hours ago

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.…

3 hours ago

మైత్రీకి డబ్బులొచ్చాయ్.. పేరు చెడుతోంది

హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…

3 hours ago