నితిన్ కొత్త సినిమా మాస్ట్రో ఓటీటీ రిలీజ్ విషయంలో ఇక సందేహాలేమీ లేనట్లే కనిపిస్తోంది. ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ ఉండదన్నది దాదాపు ఖాయమే. ఒక ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా నేరుగా డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయినట్లు కొన్ని రోజుల కిందటే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఓటీటీ హాట్ స్టార్ అని సమాచారం. ఇప్పటిదాకా తెలుగు చిత్రాలను ఎక్కువగా అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మాత్రమే తమ ఫ్లాట్ పామ్స్‌లో నేరుగా రిలీజ్ చేసేవి. హాట్ స్టార్ తెలుగు చిత్రాలపై ఎప్పుడూ పెద్దగా ఫోకస్ పెట్టలేదు.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత కూడా హాట్ స్టార్ హక్కులు కొని స్ట్రీమ్ చేసిన తెలుగు చిత్రాలు చాలా తక్కువ. ఆ ఓటీటీలో తెలుగు సినిమాలే అంతగా కనిపించవు. ఐతే దక్షిణాదిన మార్కెట్‌ను విస్తరించడంపై మిగతా ఓటీటీల్లాగే హాట్ స్టార్ కూడా దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాస్ట్రో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నితిన్ సొంతం సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో తెరకెక్కిన మాస్ట్రో సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. హిందీలో విజయవంతమైన థ్రిల్లర్ మూవీ అంధాదున్‌కు ఇది రీమేక్. జీవనోపాధి కోసం అంధుడిగా నటించే ఓ కుర్రాడు.. ఒక హత్య కేసులో సాక్షిగా మారడం.. దీని వల్ల అతడికి ఎదురయ్యే ఇబ్బందుల క్రమంలో ఉత్కంఠభరితంగా నడిచే సినిమా ఇది.
ఒరిజినల్లో ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్రను నితిన్ చేస్తుండగా.. రాధిక క్యారెక్టర్లో నభా నటేష్, టబు పాత్రలో తమన్నా నటించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. హాట్ స్టార్‌లో ఈ సినిమా డైరెక్ట్‌గా రిలీజ్ కాబోతున్నట్లు ఇంకొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.
This post was last modified on June 25, 2021 7:22 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…