చిరంజీవి వేషాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల నుంచి.. హీరోగా అవకాశాలు అందుకున్న వరకు అత్యంత సామాన్యమైన జీవన శైలి తో ఉండేవాడు… ఇంటి దగ్గర్నుంచి వచ్చిన డబ్బు ని పొదుపుగా వాడుకుంటూ మెస్ టిక్కెట్స్.. రోజూ ఒక ఫ్రూట్ జ్యుస్.. మాత్రమే తాగుతూ..కాఫీ టీ ల జోలికి వెళ్లకుండా.. వేషాల కోసం ప్రయత్నం చేసేవాడు.. ఈ దశ లో అతని రూమ్ మేట్స్ సుధాకర్.. హరిప్రసాద్.. విజయరాఘవ రోడ్ లో ఆంధ్రాక్లబ్ కి ఎదురుగా ఉండేది.. అప్పటి నుండీ తనకి తన భవిష్యత్ పట్ల ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ ఉండేది..
ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక నిర్మాత క్రాంతికుమార్ తన డబ్బింగ్ వేరే వాళ్ల తో చెప్పిద్దాం అనే ఆలోచన లో ఉండేవాడు.. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన నిద్ర లేవక ముందే వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి అక్కడే కూర్చుని ఉండేవాడు.. ఏంటి.. ఇంత పొద్దున్నే వచ్చావ్ ?.. అంటే.. ‘అదే.. అదీ.. డబ్బింగ్ వేరేవాళ్లతో చెప్పిద్దామనుకుంటున్నట్టు తెలిసింది.. నేనే చెబుతాను.. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చకపోతే అప్పుడు మార్చండి’ అని భయంభయంగా అడిగేవాడు… ‘సరే.. చూద్దాంలే’.. అనేవరకు అక్కడే ఉండేవాడు.. మరల రెండో రోజు.. మూడోరోజు… సేమ్… చివరికి ఒకదశలో క్రాంతికుమార్.. ‘సరే.. నువ్వే చెప్పు’ అనేవరకు వదిలిపెట్టలేదు.. డబ్బింగ్ చెప్పడం మొదలయ్యాక ఎటువంటి పరిస్థితిలోను నేను చెప్పిన నా గాత్రమే ఉండాలనే కసి తో.. శ్రద్ధతో డబ్బింగ్ ఫినిష్ చేసి క్రాంతికుమార్ చేత ఓకే అనిపించుకున్నాడు.. దీనినే సంకల్పబలం అంటారు.. అది ఈయనకు పుష్కలంగా వుండి అప్పటినుండి.. ఇప్పటివరకు..
తర్వాత ఏ హీరో పడనంత కష్టం.. రిస్క్ లు చేసాడు.. విపరీతమైన స్పీడ్ గా డాన్స్ చెయ్యడం ప్రాక్టీస్ చేసాడు… సాంగ్స్ కి ప్రత్యేకమైన స్టైల్ ని ప్రవేశపెట్టిన ఘనత చిరంజీవికే దక్కుతుంది.. అంతకు ముందు అక్కినేని స్టెప్స్ కి ఒక ప్రత్యేకత ఉండేది.. అంతకంటే వేగంగా తన డాన్స్ లు ఉండేలా ప్రాక్టీస్ చేసేవాడు…’జ్వాల’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పల్లవరం అనే చోట షూటింగ్. పినిశెట్టి రవిరాజా దర్సకుడు.. అతను ఏ విషయం లోనూ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు.. పల్లవరం అంటే అది ఒక క్వారీ.. కొండలను తవ్వి ఆ గ్రెనేడ్ స్టోన్స్ ని మద్రాస్ లో అమ్మడానికి పంపుతారు.. మే మాసం లో షూట్.. క్లైమాక్స్ ఫైట్.. కన్నడ ప్రభాకర్.. చిరంజీవి ల సోలో ఫైట్.. చిరంజీవి వేసుకున్న డ్రెస్స్.. ప్యాంట్ మీద ఒక టీ షర్ట్.. దానిమీద ఒక లెదర్ జాకెట్.. ఒక రిఫ్లెక్టర్ వేస్తేనే వొళ్ళు కాలుతున్నట్టు ఉంటుంది.. తళతళ మెరిసే కొండలు.. వంద రిఫ్లెక్టర్స్ వేసినంత వేడిగా ఉంటుంది.. మామూలు కాటన్ షర్ట్స్ వేసుకున్న యూనిట్ లోని మిగతావారు ఎదో ఒక నీడ చూసుకుని అటు వెళదామనే ఆలోచనలో ఉండేవారు.. అటువంటి దశలో క్రింద ఏ విధమైన సపోర్ట్ లేకుండా..రాళ్ళ మీద పడుకుని మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు షూట్ చేస్తూనే వున్నాడు.. ప్యాకప్ అన్న తర్వాత జర్కిన్.. టీ షర్ట్ తీసి చుసుకుంటే లోపల వీపు భాగమంతా కందిపోయి.. పెనం మీద వేస్తే మాడిన దోశ లాగా అయిపొయింది..
షూటింగ్ చేసేటప్పుడు తనకు కలిగే అసౌకర్యాన్ని ఏ మాత్రం పట్టించుకునేవాడు కాదు..ఇంకొక సంఘటన.. అదే సినిమా జ్వాల సినిమా ఆఖరి కాల్ షీట్.. నైట్ షూటింగ్.. కొంత ప్యాచ్ వర్క్ చేసాక రైన్ ఎఫెక్ట్ లో ఒక సీన్ తీస్తున్నారు.. మద్రాస్ అరుణాచలం స్టూడియో లో షూటింగ్.. హీరోయిన్ రాధిక తో ఫోన్ లో మాట్లాడే సీన్.. రాత్రి రెండు గంటల టైం.. రైన్ ఎఫెక్ట్ కోసం తెప్పించిన వాటర్ అయిపోయింది.. ఇంకో మూడు క్లోజ్ షాట్స్ మిగిలిపోయాయి.. మరల ట్యాంకర్ తెప్పించాలంటే ఇంకో రెండు గంటలు పడుతుంది.. ఈయన ఉదయం నాలుగు గంటల ఫ్లయిట్ కి వెళ్ళిపోవాలి.. ఆ సినిమా లాస్ట్ డే షూటింగ్.. అప్పుడు ఎవరూ అడగకుండానే ఆయనే ఒక నిర్ణయం తీసుకుని.. సెట్ అసిస్టెంట్ ని పిలిచి ఎదురుగా వున్న కొలను లోనుంచి నీళ్లు రెండు బకెట్స్ తీసుకురమ్మన్నాడు.. రవిరాజా తో సహా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.. ఎందుకంటే ఆ నీళ్లు కాలు పెట్టటానికి కూడా వీలులేనంత ఛండాలంగా పచ్చగా పాచిపోయిన నీళ్లు .. సెట్ బాయ్. డైరక్టర్ వైపు చూసాడు.. ఏం పర్వాలేదు.. త్వరగా తీసుకురా అని అతన్ని పురమాయించి ఆ నీరు తన మీద వర్షం లా పడేటట్టు చేయమన్నాడు..ఆలా మూడు షాట్స్ ఫినిష్ చేసి వేడినీళ్ళతో (అప్పటికే అక్కడ రెడీ చేసివున్నవి) స్నానం చేసి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాడు.. ఇలాంటివి ఎన్నో చేసాడు కాబట్టే అతను మెగాస్టార్ అయ్యాడు..
నా మనీ సినిమాలో ఒక పాటలో.. “చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా.. తెగించే సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా”.. అని రెండు లైన్లు సీతారామ శాస్త్రి గారు రాస్తే.. ఆయనతోనే పాడించాం.. Jd చక్రవర్తి .. బ్రహ్మానందం.. తనికెళ్ళ భరణి యాక్ట్ చేసారు.. చిరంజీవి మెగాస్టార్ అవడానికి కారణం.. తన కృషి.. పట్టుదల.. అంకితభావం మాత్రమే…..
— శివ నాగేశ్వర రావు
This post was last modified on June 25, 2021 12:49 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…