టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది తమన్నా. కొత్త హీరోయిన్ల హవా పెరిగినప్పటికీ తమన్నాకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా ‘ఎఫ్ 3’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. అలానే యంగ్ హీరో సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
ఇప్పటికే ఆమె నటించిన ‘లెవెన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వంటి వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మూడో సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ ను చేయబోతుంది. దీనికి ‘యారీ దోస్తీ’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. అరుణిమ శర్మ డైరెక్ట్ చేయబోతున్న ఈ సిరీస్ లో తమన్నా నెగెటివ్ షేడ్స్ ఉన్న లవర్ పాత్రలో కనిపించబోతుంది.
కెరీర్ పరంగా సరికొత్త పాత్రల్లో నటించాలనేది తమన్నా ఆలోచన. అందుకే వెబ్ సిరీస్ ల ద్వారా డిఫరెంట్ రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఈ సిరీస్ ను హిందీలో రూపొందించబోతున్నారు. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లి.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2022 లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on June 25, 2021 9:08 am
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…