ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండగానే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’లో వేడి రాజుకుంది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు ప్యానెళ్లను రెడీ చేసుకుంటుంటే.. ఏ ప్యానల్ తో సంబంధం లేకుండా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు జీవిత రాజశేఖర్. ఇప్పుడు అలానే సీనియర్ నటుడు సాయి కుమార్ కూడా ప్యానెల్ తో సంబంధం లేకుండా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయబోతున్నారని సమాచారం.
కొంతకాలంగా ‘మా’ వ్యవహార విషయంలో సాయికుమార్ అసంతృప్తిగా ఉన్నారట. ఎన్నికల సమయంలో ఆయన్ను పిలిపించి చిన్న పోస్ట్ లకు సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తున్నారు. వాళ్లు ఆఫర్ చేసే పోస్ట్ లు సాయికుమార్ కి నచ్చకపోయినా.. కాదనలేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇండస్ట్రీలో తనకున్న అనుభవం, తన సీనియారిటీని కన్సిడర్ చేయకుండా ‘మా’ అసోసియేషన్ సాయికుమార్ కి పోస్ట్ లు ఆఫర్ చేస్తోంది.
ఇంతకాలంగా తనకు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్ట్ లతో సరిపెడుతుండడంతో ఇప్పుడు ఆయన ధైర్యం చేసి నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఏ ప్యానెల్ తో సంబంధం లేకుండా జనరల్ సెక్రటరీ పోస్ట్ కి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సాయి కుమార్ కొన్ని సినిమాల్లో అలానే బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates