Movie News

రామోజీతో రాజ‌మౌళికి చెడిన‌ట్లేనా?


దర్శక ధీరుడు ‘బాహుబలి’ అనే అద్భుతాన్ని ఆవిష్కరించడంలో రామోజీ రావు తెర వెనుక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది రామోజీ వారి ఫిలిం సిటీలోనే అన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోకుండా సుదీర్ఘ కాలం షూటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించడంతో పాటు ఈ చిత్రానికి ఆయన ఫైనాన్స్ కూడా చేశారనే ప్రచారం ఉంది. అంతేసి భారీ సెట్లు వేసి, భారీ తారాగణంతో షూటింగ్ చేయడం వేరే చోట్ల సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ‘బాహుబలి’ విజయంలో రామోజీ పోషించిన పాత్ర ప్రత్యేకమైంది.

ఐతే సినిమా విడుదల తర్వాత ఆర్థిక విషయాలు దగ్గరికి వచ్చేసరికి రామోజీ రావుకు.. రాజమౌళి, నిర్మాతలకు మధ్య వివాదం తలెత్తినట్లుగా అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. ఈ వివాదం తాత్కాలికమే అని.. కొన్ని రోజులకు పరిస్థితులు సర్దుకుంటాయని అనుకున్నారు. కానీ రాజమౌళికి, రామోజీకి మధ్య విభేదాలు శాశ్వతం అయినట్లుగా ఇప్పుడు సందేహాలు రేకెత్తుతున్నాయి.

రాజమౌళి సినిమాల స్కేల్ ప్రకారం చూస్తే ఆయన ప్రతి చిత్రానికీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాలి. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో మాత్రం జక్కన్న అటు వైపే చూడట్లేదు. మొదట్నుంచి ఫిలిం సిటీలో షూటింగ్ అనే మాటే ఉండట్లేదు. కరోనా టైంలో బయట షూటింగ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తినా జక్కన్న ఈ విషయంలో పునరాలోచించలేదు. సిటీకి చాలా దూరంగా ఉండే ఫిలిం సిటీలో అయితే ఏ రకమైన డిస్టబెన్స్ ఉండదు. అలాగే కొవిడ్ నిబంధనల గురించి కూడా భయపడాల్సిన పని లేదు. ఈ కారణంతోనే వివిధ ఇండస్ట్రీల నుంచి ఫిలిం మేకర్స్ వచ్చి అక్కడ ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా అక్కడ ప్లాన్ చేసి ఉంటే ఈపాటికి సినిమా పూర్తయిపోయేదేని… అక్కడికి వెళ్లకపోవడం వల్లే ఎక్కువ రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చిందని.. ఐతే ఎంత ఇబ్బంది ఎదురైనప్పటికీ జక్కన్న ఫిలిం సిటీలో షూటింగ్ ఆలోచన మాత్రం చేయలేదని.. రామోజీతో ఆయనకు గట్టిగానే చెడినట్లు ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 22, 2021 8:30 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

35 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago