రామాయణ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ రామాయణ గాథ నేపథ్యంలోనే అన్న సంగతి తెలిసిందే. కాగా ‘సీత’ పేరుతో హిందీలో రామాయణాన్ని మరో కోణంలో చూపించే మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్టు సమకూర్చడం విశేషం. ఇందులో
సీతగా లీడ్ రోల్ చేసేదెవరనే విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ముందు ఈ పాత్రకు ఆలియా భట్ పేరు వినిపించగా.. ఆ తర్వాత కరీనా లైన్లోకి వచ్చింది. ఆమె సీత పాత్రకు దాదాపు ఖరారైనట్లే అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆమె పేరు వివాదంలో చిక్కుకుంది. ముస్లిం అయిన సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడటమే కాక.. తన కొడుక్కి మొగల్ పేరు పెట్టుకున్న కరీనా సీత పాత్రలో నటించడానికి వీల్లేదంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు నడిచాయి.
ఈ నేపథ్యంలో ఇటు మేకర్స్.. అటు కరీనా ‘సీత’ విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో కరీనా ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్లే అంటున్నారు. ఆలియాకేమో ఈ సినిమా చేసేంత తీరిక లేదట. దీంతో ఇప్పుడు సీత పాత్ర కోసం కంగనా రనౌత్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇండియాలో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయానికొస్తే కంగనాకున్న ఇమేజ్, మార్కెట్ ఇంకెవరికీ లేవు. వ్యక్తిగతంలో కంగనా వివాదాల మాటెలా ఉన్నా.. ఆమె అద్భుతమైన పెర్ఫామర్ అనే విషయంలో మరో మాట లేదు.
‘సీత’ సినిమాలో ఆమె నటిస్తే ఆ మూవీ రేంజే మారిపోతుంది. అందుకే ఆమెను ఈ ప్రాజెక్టులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కరీనాను ట్రోల్ చేసినపుడే సీత పాత్రకు కంగనాను తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. విజయేంద్ర మీద కంగనాకు ఎంతో గౌరవం ఉంది. మణికర్ణిక కోసం ఇద్దరూ కలిసి పని చేశారు. ఆ సమయంలో ఆయనకు పాదాభివందనం కూడా చేసింది కంగనా. ఆమెపై విజయేంద్ర కూడా ప్రత్యేక అభిమానం చూపిస్తారు. కాబట్టి ఈ ఇద్దరూ మరోసారి జట్టు కట్టే అవకాశాలు లేకపోలేదు.
This post was last modified on June 22, 2021 8:23 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…