తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ప్రకాష్ రాజ్ నిలబడబోతున్నారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. గత రెండు పర్యాయాలు మా ఎన్నికల సందర్భంగా జరిగిన రచ్చ గురించి తెలిసిందే.
నాలుగేళ్ల కిందట అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, జయసుధ పోటీపడ్డపుడు.. రెండేళ్ల కిందట నరేష్ పగ్గాలు చేపట్టినపుడు తలెత్తిన వివాదాల గురించి తెలిసిందే. మాలో పరిణామాల పట్ల మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది పెద్దలు తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేపథ్యంలో ఈసారి మంచి మార్పు జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ చిరంజీవి సహా కొందరు ప్రముఖుల అండతో మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.
మరి ప్రకాష్ రాజ్‌కు పోటీగా ఎవరు నిలబడతారన్నది ఆసక్తికరం. ఎవరు నిలబడ్డా ఆయన తెలుగు నటుడు కాదు అనే వాదన తీసుకు వచ్చే అవకాశముంది. ఐతే ప్రకాష్ రాజ్‌కు ఇప్పటికే చిరంజీవి తమ్ముడు నాగబాబు మద్దతు పలుకుతూ ఆయన నాన్ లోకల్ అనే మాట రాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్‌రాజ్ లాంటి వ్యక్తి ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు అయితే, తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని నాగబాబు అన్నారు.
ప్రకాశ్‌రాజ్ లాంటి వారు ఏ ఒక్క చిత్ర పరిశ్రమకో చెందినవారు కాదని, ఆయన భారతీయ నటుడని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఆయన ఎన్నిక విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజకీయంగా తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా, చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి తామంతా ఒకటేనని తెలిపారు. ఇక చిరంజీవి మద్దతు గురించి ప్రకాష్ రాజ్ దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతివ్వరని.. మంచి చేస్తారని అనిపిస్తే సపోర్ట్ చేస్తారని.. అన్నయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వాడుకోనని అని వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on June 26, 2021 10:03 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…