Movie News

చిరు టైటిల్ ఇంకోటి వాడేశారు


మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ అయిన సినిమాల టైటిళ్లను ఈ తరం హీరోలు ఒక్కొక్కటిగా వాడేస్తుండటం చూస్తూనే ఉన్నాం. రాక్షసుడు, ఖైదీ, హీరో, దొంగ, శ్రీరస్తు శుభమస్తు, విజేత, గ్యాంగ్ లీడర్ లాంటి చిరు సినిమాల టైటిళ్లను మళ్లీ ఉపయోగించడం తెలిసిందే. వీటిలో కొన్ని టైటిళ్ల విషయంలో అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి.

చిరు కెరీర్లో చాలా స్పెషల్ అనదగ్గ ‘గ్యాంగ్ లీడర్’ సినిమా టైటిల్‌తో ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమా చేస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఆశించగా.. నాని చిత్రానికి ఆ టైటిల్ పెట్టేయడం వారికి రుచించలేదు. దీనిపై అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. అయినా దాని మేకర్స్ తగ్గలేదు. కాగా ఇప్పుడు మరో యంగ్ హీరో చిరు ఫేమస్ సినిమా టైటిల్‌ను వాడేస్తున్నాడు. ఆ హీరో కార్తికేయ కాగా.. అతను ఉపయోగించుకుంటున్న చిరు టైటిల్.. రాజా విక్రమార్క.

రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరు చేసిన ‘రాజా విక్రమార్క’ అప్పట్లో ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడు కార్తికేయ తన కొత్త చిత్రానికి ఈ టైటిల్ పెట్టుకున్నాడు. శ్రీ సిరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. గత ఏడాది లాక్ డౌన్ టైంలోనే ఈ చిత్రం మొదలైంది. మధ్యలో దీనికి బ్రేకులు పడ్డాయి. కానీ తర్వాత దీన్ని పున:ప్రారంభించి సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో కార్తికేయ స్పెషల్ పోలీస్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఆదివారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

కార్తికేయ కుర్చీలో వెనక్కి పడుకుని సేదదీరుతుండగా.. టేబుల్ మీద గన్ను, ల్యాప్ టాప్ సహా వివిధ సామగ్రి ఉన్నాయి. ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా హీరో దీర్ఘాలోచనలో ఉన్న సంకేతాలు ఇస్తోంది ఈ ఫస్ట్ లుక్. ఇదొక థ్రిల్లర్ మూవీ అని కూడా అర్థమవుతోంది. రామా రెడ్డి అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తమిళమ్మాయి తన్య రవిచంద్రన్ ‘రాజా విక్రమార్క’తో తెలుగులో అడుగు పెట్టనుంది.

This post was last modified on June 20, 2021 4:48 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

3 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

3 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

3 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

7 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

7 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

8 hours ago