Movie News

బోల్డ్ సీన్లు.. బోలెడు బూతులు


ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన తెలుగు వెబ్ సిరీస్. ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్‌ల్లో అంతగా భారీతనం కనిపించలేదు. చాలా వరకు సాఫ్ట్ కాన్సెప్ట్స్‌తోనే తెలుగు వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. హిందీలో మీర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ తరహాలో భారీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లు తెలుగులో రాని నేపథ్యంలో.. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ఆ లోటును భర్తీ చేసేలా కనిపించింది. దీని ట్రైలర్ వెబ్ సిరీస్ ప్రియులను బాగా ఆకర్షించింది. ఈ శుక్రవారం ‘ఆహా’లో ఈ సిరీస్‌ను రిలీజ్ చేశారు.

ఐతే ట్రైలర్ ఉన్నంత ఎగ్జైటింగ్‌గా ఈ సిరీస్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. తీసి పడేయదగ్గ సిరీస్ అయితే కాదు కానీ.. అంచనాల్ని అందుకోవడంలో మాత్రం ఇది విఫలమైంది. ముఖ్యంగా ఆరంభ ఎపిసోడ్లలో ఎంతో ఆసక్తి రేకెత్తించే ఈ సిరీస్.. ఆ తర్వాత గాడి తప్పింది. చివరికి అసంతృప్తినే మిగిల్చింది.

‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’లో బాగా హైలైట్ అయింది తొలి ఎపిసోడ్లో వచ్చే స్టన్నింగ్ ట్విస్టే. పోసాని పాత్రకు ఇచ్చిన ముగింపు ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది. తర్వాతి రెండు ఎపిసోడ్ల వరకు ఈ ఆసక్తిని నిలిపి ఉంచారు. కానీ తర్వాత సిరీస్ గాడి తప్పింది. ఇక ట్రైలర్లో చూపించినట్లే ఇందులో బోలెడన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయి. ‘బిగ్ బాస్’ భామ నందిని రాయ్ ఇందులో స్టన్నింగ్ క్యారెక్టర్ చేసింది. నడి వయస్కుడైన భర్త నుంచి సంసార సుఖం అందక కుర్రాళ్లకు వల విసిరే.. ఓ కుర్రాడితో వైల్డ్ రొమాన్స్ చేసే పాత్రలో ఆమె ఆశ్చర్యానికి గురి చేసింది. నందినితో పాటు ఇంకో అమ్మాయి కూడా బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది.

ఇక ఈ సిరీస్ నిండా బోలెడన్ని బూతులు ఉన్నాయి. మీర్జాపూర్ సక్సెస్ కావడానికి బూతులు కూడా ఓ కారణం అని అర్థం చేసుకుని ఈ సిరీస్ నిండా బూతులు నింపేశారు. ప్రియదర్శి, పోసాని కృష్ణమురళి లాంటి పేరున్న ఆర్టిస్టుల నుంచి బూతులు వినడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఐతే అవసరానికి మించి ఉన్న బూతులు ఒక దశ దాటాక చికాకు పుట్టిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఒకసారి చూడ్డానికి ఓకే అనిపించే ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి అయితే కలిగించలేకపోయింది.

This post was last modified on June 19, 2021 9:53 pm

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

45 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

1 hour ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

1 hour ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

3 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago