మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలు, స్టేట్మెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్లు అలాంటి వివాదమే రాజేశాయి. ప్రత్యర్థుల నుంచి కాకుండా సొంత పార్టీ వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొనేలా చేస్తున్నాయి ఆయన ట్వీట్లు. మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేనే నిజమైన దేశభక్తుడి అభివర్ణిస్తూ నాగబాబు వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం.
‘‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే…మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’’.. ఇదీ నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.
గాడ్సే ఏ ఉద్దేశంతో గాంధీని చంపినా.. జాతి పితను అలా హతమార్చడం మాత్రం దారుణం. దీంతో అతణ్ని చరిత్ర హీనుడిగానే చూస్తోంది ప్రపంచం. ఆర్ఎస్ఎష్ వాళ్లు మాత్రం గాడ్సేను హీరో లాగా చూస్తుంటారు. అతణ్ని కొనియాడుతుంటారు. ఇప్పుడు నాగబాబు ఈ ట్వీట్లు వేయడంతో అవి ‘బీజేపీ’ రంగు పులుముకుంటున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ అవసరానికి మించి భాజపాను లేపుతున్నాడనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తుండగా.. ఇప్పుడు నాగబాబు అవసరం లేని టాపిక్ తీసుకుని అగ్గి రాజేశారు. ఆ ట్వీట్ల కింద కామెంట్లు చూస్తే నాగబాబు తానేం చేశానో ఒక అంచనాకు రాగలరేమో.
This post was last modified on May 19, 2020 2:30 pm
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…
టీడీపీ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ పాలిటిక్స్తో అదరగొట్టారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన వరుసగా రెండు రోజుల…
బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా కొత్తగా వచ్చిన హీరోలకు పరిపక్వత, పరిణితి చాలా అవసరం. ఎక్కువ అవసరం లేదు కానీ…
గత కొన్నేళ్లలో భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన సినిమా అంటే ‘ఆదిపురుష్’ అనే చెప్పాలి. ఇండియన్ ఫిలిం…