రామ్ గోపాల్ వర్మ.. ఎప్పటికప్పుడు కొత్త బ్యూటీలను పట్టుకొచ్చి వాళ్లతో సినిమాలు చేయడం, వాళ్ల అందాలను ఎలివేట్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మామూలే. ఇప్పుడాయన దృష్టి హీరోయిన్ల మీద కాకుండా ఒక యాంకర్ మీద పడింది. ఆమెనే అరియానా. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ అయి.. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ షోతో మరింత ఫేమ్ సంపాదించిన అరియానాతో వర్మ ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసినట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
వర్మను అరియానా జిమ్ సెషన్లో ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇంటర్వ్యూ అంటే వర్మ వర్కవుట్ చేస్తుంటే అరియానా పక్కన నిలబడి ప్రశ్నలు వేయడం కాదు. హాట్ హాట్‌గా కనిపించే జిమ్ డ్రెస్ వేసుకుని.. వర్మతో కలిసి వర్కవుట్లు చేస్తూనే ఆయన్ని అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ టీజర్‌ను గురువారం రాత్రి ట్విట్టర్లో షేర్ చేశాడు వర్మ.
ఐతే ఈ వీడియో చూస్తే ఇక్కడ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేయడం పెద్ద విషయంలాగా లేదు. ఆమె హాట్ లుక్స్ ఎలివేట్ చేయడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంటర్వ్యూ చేయబడుతున్న వర్మ మీద కాకుండా.. ఇంటర్వ్యూ చేస్తున్న అరియానా మీదే కెమెరా ఫోకస్ మొత్తం నిలిచింది. ఆమెను రకరకాల హాట్ భంగిమల్లో చూపించారిందులో. వర్మ అరియానాకు వర్కవుట్లు నేర్పించడం.. ఆమెతో చాలా క్లోజ్‌గా మూవ్ కావడం విశేషం.
మాటలేమీ వినిపించకుండా కేవలం దృశ్యాలు మాత్రమే కనిపించిన ఈ టీజర్ మొత్తం చూస్తే.. వర్మను అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్లు కాకుండా వాళ్లిద్దరూ వర్కవుట్లు చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నట్లే ఉంది. ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియోను శుక్రవారం రాత్రి రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ వెల్లడించాడు. వర్మ మాటలు, అరియానా అందాలే ఆకర్షణగా రాబోతున్న ఈ ఇంటర్వ్యూ నెటిజన్ల దృష్టిని బాగానే ఆకర్షించే అవకాశముంది.
This post was last modified on June 18, 2021 10:07 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…