బాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకు నీనా గుప్తా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్న ఆమె.. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌లోనూ సత్తా చాటుతోంది. బదాయి హో, ముల్క్, సర్దార్ కా గ్రాండ్ సన్ లాంటి సినిమాల్లో నీనా నటనకు గొప్ప ప్రశంసలు లభించాయి. సినీ రంగంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నటి.. ఇటీవలే ‘సచ్ కహు తో’ పేరుతో తన ఆత్మకథను రాసింది. అందులో కొన్ని సంచలన విషయాలూ ఉన్నాయి.
ముఖ్యంగా తాను కథానాయికగా ఉన్న రోజుల్లో దక్షిణాదికి చెందిన ఓ అగ్ర నిర్మాతతో ఎదురైన చేదు అనుభవం గురించి ఆమె ఒక ఎపిసోడ్ రాసింది. సినిమా అవకాశం ఇస్తానంటూ పిలిచి తనతో పడుకోవాలని ఆ నిర్మాత బలవంతం చేసినట్లు నీనా వెల్లడించడం గమనార్హం. ఆ ఎపిసోడ్ గురించి కాస్త వివరంగానే చెప్పుకొచ్చింది నీనా.
ఒక సినిమాలో పాత్రకు సంబంధించి కలవమని ఓ సౌత్ టాప్ ప్రొడ్యూసర్ తనను హోటల్‌కు పిలిచాడని.. ఐతే అక్కడ తాను ఆయన్ని లాబీలో కలవాలని అనుకోగా ఆయన మాత్రం పైన తన గదికి రావాలని పిలిచాడని నీనా తెలిపింది. పైకి వెళ్లడం గురించి సందేహిస్తూనే అక్కడికి వెళ్లానని.. తాను ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలో ప్రధాన పాత్రకు స్నేహితురాలి పాత్రను తనకు ఆఫర్ చేశాడని.. ఐతే అది చిన్న పాత్రగా అనిపించడంతో తాను చేయాలని అనుకోలేదని.. ఆ విషయం చెప్పి వెళ్లబోతుంటే తనతో ఆ నిర్మాత అసభ్యంగా మాట్లాడాడని నీనా చెప్పింది.
“ఎక్కడికి వెళ్తావు. నువ్వు ఈ రాత్రి నాతో గడపట్లేదా” అని సదరు నిర్మాత అడిగాడని.. దీంతో తాను షాకయ్యానని.. తల మీద ఒక బకెట్ ఐస్ వాటర్ పోసినట్లుగా అయిపోయానని.. తాను వెళ్లాలని అనడంతో ఆ నిర్మాత బ్యాగ్ తీసి తన చేతుల్లోకి విసిరి కొట్టాడని.. “వెళ్లాలంటే వెళ్లు.. నిన్నెవరూ ఇక్కడ బలవంతం చేయట్లేదు” అని కోపంగా చెప్పడంతో అక్కడి నుంచి బయటపడ్డానని నీనా వెల్లడించింది.
This post was last modified on June 18, 2021 6:47 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…