Movie News

లిస్టులో బెల్లంకొండ సినిమా లేదే..

పెన్ స్టూడియోస్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. వ్యాపారవేత్త జయంతిలాల్ గద నేతృత్వంలో ఈ సంస్థ పుష్కర కాలం కిందట్నుంచే సినిమాలు నిర్మిస్తోంది. స్టూడియో కూడా నెలకొల్పి సినీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే సినిమాల లైబ్రరీని కూడా మెయింటైన్ చేస్తోంది. ఐతే ఒకప్పటితో పోలిస్తే ఈ సంస్థ ఇటీవల దూకుడు పెంచింది.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఉత్తరాది థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం.. అలాగే ఆ చిత్ర డిజిటల్ హక్కులను కూడా హోల్‌సేల్‌గా కొనేయడం.. ఇందుకోసం మొత్తంగా రూ.500 కోట్ల దాకా వెచ్చించడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వరుసగా కొన్ని భారీ చిత్రాలను కూడా ప్రకటించిందీ సంస్థ. కరోనా బ్రేక్ తర్వాత బాలీవుడ్లో అత్యంత దూకుడుగా సినిమాలు రిలీజ్ చేయబోతోంది ఈ సంస్థ. తమ నుంచి రాబోతున్న సినిమాలతో ఒక షో రీల్ కూడా రెడీ చేసింది పెన్ మూవీస్.

‘ఆర్ఆర్ఆర్’తో పాటు బాలీవుడ్లో మరికొన్ని భారీ చిత్రాలను తమ బేనర్ నుంచే రిలీజ్ చేస్తోంది పెన్ మూవీస్. అందులో కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజవుతున్న తొలి భారీ చిత్రం ‘బెల్ బాటమ్’ కూడా ఒకటి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జులై 27న విడుదల చేయనున్నారు. అలాగే జాన్ అబ్రహాం సినిమా ‘ఎటాక్’, ఆలియా భట్-సంజయ్ లీలా బన్సాలీల ‘గంగూభాయి కథియావాడి’లను కూడా పెన్ మూవీసే రిలీజ్ చేయబోతోంది. వీటితో పాటు ఈ షో రీల్‌లో తాము నిర్మించబోయే ‘అన్నియన్’ రీమేక్‌ను కూడా చూపించారు. శంకర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఐతే ఆ సినిమా వచ్చే ఏడాది మొదలై.. ఆ తర్వాతి ఏడాది విడుదల కాబోతోంది. దాని గురించి కూడా వీడియోలో చూపించిన పెన్ మూవీస్.. మన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఛత్రపతి’ రీమేక్ ప్రస్తావన మాత్రం తేలేదు. నిజానికి ప్రస్తుతం పెన్ మూవీస్ ప్రొడక్షన్లో సెట్స్ మీదికి వెళ్లనున్న ఏకైక చిత్రమిదే. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో మరి.

This post was last modified on June 17, 2021 2:26 pm

Share
Show comments

Recent Posts

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

29 minutes ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

39 minutes ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

3 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

3 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

3 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

3 hours ago