గత ఏడాది కరోనా మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి కొత్త సినిమాలను నేరుగా ఓటీటీల్లో చూసే అవకాశం లభిస్తోంది ప్రేక్షకులకు. మొదట్లో చిన్న చిత్రాలనే ఇలా రిలీజ్ చేశారు కానీ.. తర్వాత తర్వాత మీడియం, పెద్ద స్థాయి సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. ఈ వరుసలో ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న భారీ తమిళ చిత్రం ‘జగమే తంత్రం’.
అసురన్, కర్ణన్ లాంటి బ్లాక్‌బస్టర్లతో మంచి ఊపు మీదున్న ధనుష్ హీరోగా.. పిజ్జా, జిగర్‌తండ, పేట చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన చిత్రమిది. ఈ నెల 18న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు ముందే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే ఓటీటీలో కొత్త సినిమా విడుదల అనగానే.. అది ఏ సమయానికి స్ట్రీమ్ అవుతుందా అని ప్రేక్షకులు చూస్తుంటారు. ఈ విషయంలో ఓటీటీలు సరైన క్లారిటీ ఇవ్వవు.
కొన్ని ఓటీటీలు అర్ధరాత్రి 12 గంటల నుంచి కొత్త సినిమాలను స్ట్రీమ్ చేస్తాయి. కొన్ని నిర్దిష్టమైన టైం ఫిక్స్ చేస్తాయి. కొన్ని ఓటీటీలు ఏ క్లారిటీ ఇవ్వకుండా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. తమకు తోచిన సమయానికి సినిమాను స్ట్రీమ్ చేస్తుంటాయి. ఐతే ‘జగమే తంత్రం’ మీద ఉన్న భారీ అంచనాల దృష్ట్యా నెట్ ఫ్లిక్స్ మాత్రం రిలీజ్ టైంను ముందే ప్రకటించి ప్రేక్షకులు గందరగోళానికి గురి కాకుండా చూసింది. ఈ చిత్రం ముందు రోజు అర్ధరాత్రి కాకుండా 18న మధ్యాహ్నం 12.30 గంటల నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది.
‘జగమే తంత్రం’ రిలీజ్ టైం చెప్పమంటూ ధనుష్ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూసే నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఇలా అప్‌డేట్ ఇచ్చినట్లున్నారు. ఈ చిత్రాన్ని 190 దేశాల్లో, 17 భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయబోతుండటం విశేషం. ధనుష్ ఇందులో ఒక సామాన్యుడిగా మొదలుపెట్టి ఇంటర్నేషనల్ డాన్ అయ్యే పాత్రలో నటిస్తున్నాడు. కథ చాలా వరకు యూకేలో నడుస్తుంది.
This post was last modified on June 16, 2021 6:13 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…