ఒకప్పుడు ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో హీరోగా మంచి స్థాయిలో ఉన్నాడు శ్రీకాంత్. ఐతే ఆ తరం మీడియం రేంజ్ హీరోలు చాలామంది లాగే ఒక దశ దాటాక అతను కూడా ఇబ్బంది పడ్డాడు. హీరోగా మార్కెట్ కోల్పోయిన అతను.. అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కెరీర్‌ను నడిపిస్తూ వచ్చాడు కానీ.. లీడ్ రోల్స్ మాత్రం మానలేదు. కానీ ఒక దశ దాటాక శ్రీకాంత్ హీరోగా చేసే సినిమాలను జనాలు పట్టించుకోవడమే మానేశారు. ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ కూడా పెద్దగా లేకపోవడంతో శ్రీకాంత్ ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది.
ఇలాంటి టైంలోనే నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ చిత్రం కోసం విలన్ అవతారమెత్తాడు శ్రీకాంత్. ఇంతకుముందు కూడా శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేసినప్పటికీ.. అఖండ తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని అతను ఆశిస్తున్నాడు.
లెజెండ్ తర్వాత జగపతిబాబు లాగే అఖండ తర్వాత శ్రీకాంత్ విలన్‌గా బిజీ అయిపోతాడనే అంచనాలున్నాయి. ఐతే బాలయ్య మాత్రం ఇది కరెక్ట్ కాదు అంటుండటం గమనార్హం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో అఖండ గురించి మాట్లాడుతూ.. శ్రీకాంత్ ప్రస్తావన తెచ్చాడు. ఈ చిత్రంలో అతను అద్భుతమైన పాత్ర చేస్తున్నట్లు చెప్పాడు. ఐతే అఖండ తర్వాత శ్రీకాంత్ పూర్తిగా విలన్ పాత్రలు ఎంచుకోవాలనుకుంటే అది సరి కాదంటూ తాను స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలయ్య చెప్పడం విశేషం.
విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోగా కూడా సినిమాలు చేయాలని తాను శ్రీకాంత్‌కు సూచించానని.. అతడి కోసం తనే స్వయంగా కథలు, పాత్రలను ఎంపిక చేసి ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్లు బాలయ్య పేర్కొనడం గమనార్హం. చూస్తుంటే అఖండ సినిమా చేస్తూ శ్రీకాంత్ బాలయ్యకు బాగానే దగ్గరైనట్లు కనిపిస్తోంది. మరి ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్‌కు ఎలాంటి మలుపు తీసుకొస్తుందో చూడాలి.
This post was last modified on June 15, 2021 6:52 am
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…