అక్కినేని అఖిల్ తెరంగేట్రానికి ముందు నెలకొన్న హడావుడిని జనాలు అంత సులువుగా మరిచిపోలేరు. టాలీవుడ్లో ఇప్పటిదాకా ఏ వారసుడి అరంగేట్రంలోనూ లేనంత హంగామా అప్పుడు కనిపించింది. ఆ మాటకొస్తే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తొలి చిత్రానికి కూడా అంత హైప్ రాలేదు. అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’ మీద దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ పెట్టడం.. రూ.40 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం. కానీ ఏం ప్రయోజనం. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. అఖిల్ కెరీర్‌కు ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడింది.
ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా చేసిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలూ నిరాశనే మిగిల్చాయి. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైతేనేం అఖిల్‌కు అవకాశాలకైతే లోటు లేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో అతను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ సినిమా రిలీజై దాని ఫలితాన్ని బట్టి అఖిల్ కెరీర్ ఆధారపడి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం విడుదల కాకముందే అఖిల్ చేతిలోకి క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే సురేందర్ రెడ్డి లాంటి పెద్ద దర్శకుడితో ‘ఏజెంట్’ అనే భారీ చిత్రం ఖరారైంది. కెరీర్లో ఈ దశలో అంత పెద్ద దర్శకుడితో, భారీ చిత్రం చేసే అవకాశం రావడం ఆశ్చర్యం. ఇప్పుడేమో టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్‌గా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అఖిల్ సినిమా ఖరారైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ బేనర్లో ఒక ప్రేమకథా చిత్రం చేయబోతున్నాడట అఖిల్. దర్శకుడెవరన్నది బయటికి రాలేదు కానీ.. స్క్రిప్టు ఓకే అయిందని, సినిమాను త్వరలోనే లాంఛనంగా ప్రకటించబోతున్నారని అంటున్నారు.
ఐతే మూడు డిజాస్టర్లు ఇచ్చినా అఖిల్‌కు ఇలా క్రేజీ సినిమాలు పడుతున్నాయంటే అది అతడి ఆకర్షణా.. లేక తెరవెనుక నాగ్ మంత్రాంగం వల్లనా అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. చాలామంది రెండో దానికే ఓటేస్తున్నారు.
This post was last modified on June 14, 2021 5:58 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే ఓ పక్క మహాయుతి కూటమి..మరో పక్క మహా…