‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌లో పెర్ఫామెన్స్ పరంగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిందంటే సమంత అక్కినేనినే అని చెప్పాలి. మనోజ్ బాజ్‌పేయి లాంటి లెజెండరీ నటుడి ముందు ప్రత్యేకత చాటుకుని షోలో హైలైట్ కావడమంటే మాటలు కాదు. ఐతే సమంతకు ఆ విషయంలో నూటికి నూరు మార్కులు పడ్డాయి. హీరోయిన్లకు డ్రీమ్ రోల్ లాంటి పాత్ర దక్కడంతో సమంత దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ఈ సిరీస్ కోసం ఆమె పడ్డ కష్టమంతా తెరపై కనిపించింది.
ఆ కష్టానికి తగ్గట్లే సమంత కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా దీనికి రూ.4 కోట్ల పారితోషకం ఇచ్చారట. ఇప్పటిదాకా ఓ సినిమాకు సమంత గరిష్టంగా తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.2 కోట్లు మాత్రమే. దాని మీద రెట్టింపు మొత్తం అందుకుంది సామ్. కానీ ఆ మొత్తానికి ఆమె పూర్తి న్యాయం చేసింది కూడా. ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వల్ల సామ్‌కు ఇప్పుడు మరో బంపరాఫర్ తగిలినట్లు సమాచారం.
అమేజాన్ తర్వాత మరో డిజిటల్ స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ కోసం సమంత పని చేయబోతోందని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. సామ్ ప్రధాన పాత్రలో ఒక భారీ వెబ్ సిరీస్‌కు నెట్ ఫ్లిక్స్ వాళ్లు సన్నాహాలు చేస్తున్నారట. బహు భాషల్లో ఈ సిరీస్ తెరకెక్కనుందట. దీని కోసం సమంతకు ఏకంగా రూ.8 కోట్ల పారితోషకం ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉండటం, బల్క్ డేట్స్ ఇవ్వాల్సి రావడంతో పారితోషకం భారీగా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.
‘ఫ్యామిలీ మ్యాన్-2’తో పెరిగిన సమంత క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి ఇలా భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వందల కోట్లు పెట్టి ఒరిజినల్స్ తీసే నెట్ ఫ్లిక్స్.. ఇండియాలో ఇప్పుడిప్పుడే జోరు పెంచుతోంది. వివిధ భాషల్లో పెద్ద బడ్జెట్లు పెట్టి భారీ సిరీస్‌లు తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సామ్‌తో ఓ ప్రాజెక్టును లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
This post was last modified on June 14, 2021 12:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…