కోలీవుడ్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఈ ఏడాది ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు విజయ్. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తరువాత విజయ్ తెలుగులో సినిమా చేయబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ భారీ బడ్జెట్ సినిమాను టేకప్ చేయబోతున్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వంశీ ఫైనల్ డ్రాఫ్ట్ ను రెడీ చేయడంతో పాటు క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా సినిమాకి అరవై నుండి ఎనభై కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకునే విజయ్ ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
రూ.100 కోట్లు రెమ్యునరేషన్ అడగ్గా.. దిల్ రాజు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ పారితోషికమే వంద కోట్లు అంటే ఇక మొత్తం సినిమా బడ్జెట్ ఎలా లేదన్నా రూ.200 కోట్లు దాటేయడం ఖాయం. నిజానికి సౌత్ లో ఏ హీరోకి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చింది లేదు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ రావడంతో.. ఆయనకి మాత్రమే రూ.100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు విజయ్ కూడా అదే రేంజ్ లో అందుకోవడం విశేషం.
This post was last modified on June 14, 2021 12:10 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…