Movie News

ఇండియాలో ది బెస్ట్ వెబ్ సిరీస్ అదే

ప్రధాన పాత్రలో ప్రతీక్ గాంధీ అనే పెద్దగా పేరు లేని నటుడు.. దర్శకత్వం వహించిందేమో అంతగా ఫామ్‌లో లేని హన్సల్ మెహతా.. వీరి కలయికలో ‘స్కామ్ 1992’ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి కలగలేదు. రిలీజ్ ముంగిట అసలు హడావుడే లేదు. కానీ గత ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటికే ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, సేక్ర్డ్ గేమ్స్ లాంటి వెబ్ సిరీస్‌లు చూసి ఫిదా అయిన భారతీయ ప్రేక్షకులు.. వాటిన్నింటినీ మించిన సిరీస్ ఇదని తీర్పిచ్చారు.

రిలీజ్ తర్వాత అద్భుతమైన రివ్యూలు రావడంతో ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎగబడ్డారు. కేవలం ఈ సిరీస్‌ వల్లే ‘సోనీ లైవ్’ సబ్‌స్క్రిప్షన్లు అసాధారణంగా పెరిగాయి. ఆ ఓటీటీకి మంచి పాపులారిటీ లభించింది. సౌత్ వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఈ ఓటీటీని సబ్‌స్క్రైబ్ చేసుకుని ‘స్కామ్ 1992’ చూశారు.

ఇప్పటికే ‘ది బెస్ట్’ ఇండియన్ వెబ్ సిరీస్‌గా ప్రేక్షకులతో కితాబులందుకున్న ‘స్కామ్ 1992’ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రేటింగ్ ఇచ్చే ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) గుర్తింపునూ సంపాదించింది. వరల్డ్ వైడ్ అత్యుత్తమ వెబ్ సిరీస్‌ల్లో ‘స్కామ్ 1992’కు ఆల్ టైం 9వ స్థానం దక్కడం విశేషం. ఐఎండీబీలో అత్యుత్తమ రేటింగ్ సంపాదించిన ఇండియన్ వెబ్ సిరీస్ ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 10కి 9.6 రేటింగ్‌తో ఈ సిరీస్ వరల్డ్ వైడ్ టాప్-10లో స్థానం దక్కించుకుంది.

ఈ జాబితాలో ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’, ‘బ్రేకింగ్ బ్యాడ్’, ‘చెర్నోబిల్’ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటిగా 1992లో బయటపడ్డ స్టాక్ మార్కెట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా తేలిన హన్సల్ మెహతా జీవిత కథను ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దిన సిరీస్ ‘స్కామ్ 1992’. దర్శకుడిగా హన్సల్, నటుడిగా ప్రతీక్ అద్భుత పనితనంతో ఈ సిరీస్‌ను మరో స్థాయిలో నిలబెట్టింది.

This post was last modified on June 12, 2021 1:43 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

2 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

3 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

11 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

12 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 hours ago