Movie News

మ‌ళ్లీ మెగాఫోన్ ప‌డుతున్న ఆ లెజెండ్


యండ‌మూరి వీరేంద్ర నాథ్.. తెలుగు వాళ్లు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని అసాధార‌ణ‌ ర‌చ‌యిత‌. తెలుగులో ఆయ‌న్ని మించిన గొప్ప ర‌చ‌యిత‌లు ఉండొచ్చు కానీ.. ఆయ‌న‌లా కొన్ని త‌రాల‌ను ఉర్రూత‌లూగించిన ఎంట‌ర్టైనింగ్ రైట‌ర్ మ‌రొక‌రు లేరు అంటే అతిశ‌యోక్తి కాదు. కేవ‌లం త‌న న‌వ‌ల‌లు, వ్య‌క్తిత్వ వికాస పుస్త‌కాల‌తో సాహితీ ప్రియుల‌నే కాదు.. అద్భుత‌మైన‌ స్క్రిప్టుల‌తోనూ సినీ ప్రేమికుల‌నూ అదే స్థాయిలో అల‌రించిన రైట‌ర్ ఆయ‌న‌.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయ‌న ర‌చ‌న‌లో క్లాసిక్స్, సూప‌ర్ హిట్స్ వ‌చ్చాయి. అభిలాష‌, ఛాలెంజ్, దొంగ‌మొగుడు, రాక్ష‌సుడు, పున్న‌మి నాగు.. ఇలా వీరి క‌ల‌యిక‌లో ఎన్నో మ‌రపురాని సినిమాలు వ‌చ్చాయి. చిరంజీవి సినిమా స్టువ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్‌తోనే యండ‌మూరి మెగా ఫోన్ కూడా ప‌ట్టారు. కాక‌పోతే ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. మ‌ళ్లీ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం జోలికి వెళ్ల‌లేదు.

సినీ ర‌చ‌యిత‌గా కూడా యండ‌మూరి వైభ‌వం 90వ ద‌శ‌కంలోనే ఆగిపోయింది. ద‌శాబ్దం కింద‌ట వ‌చ్చిన శ‌క్తి సినిమాకు ఆయ‌న క‌థ అందించారు. అది పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో సినిమాల‌కు దూరం అయిపోయారు. ఐతే ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుండ‌టం, అది కూడా ద‌ర్శ‌కుడిగా కావ‌డం విశేషం. తాను ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన దొంగ‌మొగుడు సినిమాలో బాగా పాపుల‌ర్ అయిన న‌ల్లంచు తెల్ల‌చీర అనే పాట ప‌ల్ల‌వినే టైటిల్‌గా పెట్టి సినిమా తీస్తున్నారు యండ‌మూరి.

భూష‌ణ్‌, ద‌యా, జెన్ని, కిషోర్ దాస్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. వ‌య‌సు 70కి పైబ‌డ్డ‌ప్ప‌టికీ హుషారుగా క‌నిపించే యండ‌మూరి.. యూత్ ఫుల్ సినిమా తీస్తున్నట్లు చెబుతున్నారు. తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ర‌వి క‌న‌గాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి ఈ వ‌య‌సులో ద‌ర్శ‌కుడిగా యండ‌మూరి ఏమాత్రం స‌త్తా చాటుతారో చూడాలి.

This post was last modified on June 12, 2021 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

4 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

5 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

6 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

7 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

7 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

7 hours ago