బాలీవుడ్లో కంగనా రనౌత్ తర్వాత ఈ తరంలో నటిగా అంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ అంటే తాప్సినే. ఆమె ఫాలోయింగ్ కూడా తక్కువేమీ కాదు. దక్షిణాది సినిమాల్లో కేవలం గ్లామర్ తారలాగా ఉన్న తాప్సి.. హిందీలో మాత్రం మంచి మంచి పాత్రలతో నటిగా గొప్ప పేరు సంపాదించింది. తనకంటూ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకుంది. పింక్, బద్లా, ముల్క్, నామ్ షబానా, తప్పడ్ లాంటి చిత్రాలు ఆమెకు గొప్ప పేరే తెచ్చిపెట్టాయి.
ఇప్పుడు దాదాపు అరడజను చిత్రాలు చేతిలో ఉంచుకుంది తాప్సి. ఐతే ఇప్పటికే తాప్సి ప్రేమలో ఉండటం, పైగా వయసు 30 ప్లస్‌లోకి వచ్చేయడంతో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు అభిమానులు, మీడియా వాళ్ల నుంచి ఎదురవుతున్నాయి తాప్సికి.
ఐతే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసిన తాప్సి.. తనకు కళ్యాణ్ ఘడియలు ఎప్పుడు వస్తాయో హింట్ ఇచ్చింది. ప్రస్తుతం తాను ఏడాదికి ఆరు సినిమాలు చేస్తున్నానని.. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోనని.. ఐతే ఏడాదిలో తన సినిమాలు రెండు మూడుకు పడిపోయినపుడు వివాహం చేసుకుంటానని ఆమె చిత్రమైన మెలిక పెట్టింది.
ప్రస్తుతం తాప్సి ఊపు చూస్తుంటే మాత్రం రాబోయే కొన్నేళ్లలో ఆమె పెళ్లి వైపు అడుగులు వేయడం కష్టమే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో గతంలో తాప్సి ప్రేమలో ఉంది. ఐతే ఈ మధ్య వాళ్లిద్దరూ కలిసి కనిపించడం లేదు. మరి తాప్సి అతడితోనే రిలేషన్షిప్‌లోనే ఉందో లేదో తెలియదు కానీ.. తాను సినీ రంగానికి చెందిన వ్యక్తినైతే పెళ్లి చేసుకోనని ఆమె స్పష్టం చేసింది.
This post was last modified on June 12, 2021 10:52 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…