Movie News

ఈవీవీ జయంతి.. ‘టైటిల్ స్టోరీస్’ ట్రెండింగ్

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లలో ఒకడైన ఈవీవీ సత్యనారాయణ 66వ జయంతి ఈ రోజు. ఆయన చనిపోయి పదేళ్లు దాటిపోయింది. ఐతే ఈ పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆయన జయంతి సంబరాలు ఈసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులు చొరవ తీసుకుని ఈవీవీ మీద ముందు రోజే స్పేస్ పెట్టడం ద్వారా ట్విట్టర్లో ఈ దిగ్గజ దర్శకుడి పేరు ట్రెండ్ అవుతోంది. జయంతి రోజు ఈవీవీ సినిమాల తాలూకు వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి.

ఇంకెవరీకి సాధ్యం కాని రీతిలో ఓవర్ ద టాప్, ఎక్స్‌ట్రీమ్ కామెడీ చేయడం ఈవీవీకే చెల్లు. అతిగా అనిపిస్తూనే అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఆయన సినిమాల కామెడీ. వేరే సినిమాల్లో కామెడీ సినిమా మొదలయ్యాక మొదలవుతుంది కానీ.. ఈవీవీ సినిమాల్లో మాత్రం టైటిల్ కార్డ్స్ దగ్గరే ప్రేక్షకుల ముఖాల్లోకి చిరునవ్వుల్ని తీసుకొచ్చేస్తారు ఈవీవీ. ఈ ప్రత్యేకతను చాటే వీడియోలు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి.

తన సినిమాలకు భలే సరదాగా ఉండే టైటిళ్లు పెట్టడమే కాదు.. టైటిల్ కార్డ్స్ కూడా భిన్నంగా ఉండేలా చూసుకుంటారు ఈవీవీ. ముఖ్యంగా శ్రీకాంత్ హీరోగా ఈవీవీ తీసిన ‘పిల్లనచ్చింది’ సినిమా టైటిల్ కార్డ్స్ చూస్తే.. ఇప్పటిదాకా తెలుగు సినీ పరిశ్రమలోనే మరే చిత్రానికీ ఇంత ఫన్నీగా జరగలేదంటే అతిశయోక్తి కాదు.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ల బొమ్మలేసి.. వాళ్లందరూ అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, డేట్లు కష్టమని భావించి శ్రీకాంత్‌ను పెట్టాం అనడం.. సంగీత దర్శకుడిగా రెహమాన్‌ను పెట్టుకుందాం అనుకుంటే కోటి రూపాయలు అడిగాడని కోటితో సర్దుకపోయాం.. దర్శకుడిగా స్టీఫెన్ స్పీల్బర్గ్‌ను అడిగితే ఇంగ్లిష్‌లో సినిమా తీస్తానన్నారని ఈవీవీతో అడ్జస్ట్ అయిపోయాం.. ఇలా సాగుతుంది ఆ సినిమా టైటిల్స్ వరస. ఈ చిత్రం మాత్రమే కాదు.. ఈవీవీ తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’ దగ్గర్నుంచి చూస్తే అప్పుల అప్పారావు, ఏవండీ ఆవిడ వచ్చింది.. ఇలా చాలా ఈవీవీ సినిమాల టైటిల్ కార్డ్స్ చాలా డిఫరెంట్‌గా, ఫన్నీగా కనిపిస్తాయి. వాటి తాలూకు వీడియోలను షేర్ చేస్తూ ఈవీవీకి ఈవీవీనే సాటి అంటూ అభిమానులు ఆయన్ని స్మరించుకుంటున్నారు.

This post was last modified on June 10, 2021 5:34 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

2 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

2 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

4 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

6 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

6 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

8 hours ago