ఈ గురువారం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ట్విట్టర్లో ఆయన మీద స్పేస్ ఏర్పాటు చేశారు. ఈవీవీ తనయుడు అల్లరి నరేష్‌తో పాటు దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సుధీర్ వర్మ, కళ్యాణ్ కష్ణ కురసాలలతో పాటు అనసూయ, గోపీమోహన్.. ఇలా చాలామంది సినీ ప్రముఖులు ఈ స్పేస్‌లో పాల్గొన్నారు. వీళ్లతో పాటు చాలామంది ఈవీవీతో అనుబంధం, ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకునేలా మాట్లాడారు.
ఐతే మిగతా వాళ్ల స్పీచ్‌లన్నీ ఒకెత్తయితే.. హరీష్ శంకర్ ప్రసంగం మరో ఎత్తు. ఈవీవీ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఆయనకు ఎలివేషన్లు ఇచ్చాడు హరీష్ శంకర్. అలాగే ఈవీవీతో మెగాస్టార్ చిరంజీవి చేసిన అల్లుడా మజాకా సినిమా గురించి ఆయన మాట్లాడిన తీరు మెగా అభిమానుల్ని కూడా అమితంగా ఆకట్టుకుంది.
ఈవీవీ పరిశ్రమలోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి దర్శకుడిగా నిలదొక్కుకోవడం గురించి హరీష్ హృద్యమైన మాటలు మాట్లాడాడు. దర్శకుడు కావడం ఓ కష్టం అయితే.. తొలి సినిమా (చెవిలో పువ్వు) ఫ్లాప్ అయ్యాక నిలదొక్కుకోవడం మరింత కష్టమని, కానీ ఏ రోజు కూడా ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి, బాధ పడినట్లు ఎవరి దగ్గరా వినలేదని హరీష్ చెప్పాడు. ఈవీవీ తన సినిమాల్లో పండించిన కామెడీ, ఎమోషన్ల గురించి కూడా హరీష్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆమె లాంటి సినిమా ఆయన చేయడమేంటి అనిపించిందని, కానీ ఆ సినిమా చూసి షాకైపోయామని, ఈవీవీ కూడా తన కెరీర్లో ఎంతో గర్వంగా చెప్పుకునే సినిమాల్లో ఇదొకటని హరీష్ అన్నాడు.
చాలా సీరియస్‌గా సాగే సన్నివేశాల్లో కూడా కామెడీ పెట్టే సాహసం ఈవీవీ మాత్రమే చేయగలరంటూ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో క్లైమాక్స్‌ను హరీష్ ఉదహరించాడు. హల్లో బ్రదర్ సినిమా చూసి మెగాస్టార్ అభిమానిగా చిరు ఆ సినిమా చేసి ఉండాల్సిందని ఫీలయ్యానని.. తర్వాత ఈవీవీతో అల్లుడా మజాకా సినిమా అనౌన్స్ కావడంతో ప్రతివారం ఆ సినిమా అప్‌డేట్స్‌తో వచ్చే సూపర్ హిట్ మ్యాగజైన్ కోసం ఎదురు చూసేవాణ్నని.. ఈ సినిమా హైదరాబాద్ సంధ్య థియేటర్లో 125 రోజులకు పైగా ఆడిందని, పది సార్లకు పైగా చూశానని హరీష్ గుర్తు చేసుకున్నాడు. ఈవీవీ దగ్గర పని చేయాలనే క్రేజ్ ఒక సమయంలో ఎలా ఉండేదో చెబుతూ.. అబ్బాయిగారు సినిమాకు ఒక షాట్‌కు క్లాప్ కొట్టి పక్కన పెట్టి వెళ్లిపోతే ఇంకో సీన్‌కు మరో అసిస్టెంట్ చేతిలో క్లాప్ బోర్డు ఉండేదని హరీష్ చెప్పాడు.
This post was last modified on June 10, 2021 1:41 pm
పుష్ప 2 ది రూల్ నేపధ్య సంగీతం ఇతరులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్…
ఇన్స్టాగ్రామ్ లో తన క్యూట్ ఫొటోస్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ ఆషికా రంగనాథ్. 2023లో కళ్యాణ్ రామ్…
ఏపీ రాజధాని అమరావతిలో తొలి ప్రైవేటు నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. రాజధాని ప్రాంతంలో 2015-17 మధ్య నటుడు,…
ఏపీకి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ప్రధాని…
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదనేది అందరికీ తెలిసిందే. 2014లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ,…