పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్ల కెరీర్లు డౌన్ అవుతుంటాయి. కొందరికి క్లోజ్ అయిపోతుంటాయి కూడా. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు. వివాహం తర్వాత కూడా ఏమాత్రం స్పీడు తగ్గించరు. మరింత పెంచుతారు కూడా. ఈ అరుదైన జాబితాలోకే చేరుతోంది కాజల్ అగర్వాల్. రెండు మూడేళ్ల ముందు ముందు అవకాశాలు తగ్గిపోయి కళ్యాణ్ రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన కాజల్.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలతో భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.
ఇవి సెట్స్ మీద ఉండగానే, గత ఏడాది కరోనా బ్రేక్‌లో ఆమె పెళ్లి చేసుకుంది. ముందు ఒప్పుకున్న సినిమాలు కాబట్టి పెళ్లి తర్వాత కాజల్ వాటిని పూర్తి చేసి వ్యక్తిగత జీవితంలో సెటిలైపోతుందేమో అనుకున్నారు. కానీ ఆమె మాత్రం వివాహానంతరం క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
ఇప్పటికే నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రానున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన కాజల్.. ఇటీవలే ‘ఉమ’ అనే పాన్ ఇండియా సినిమాలో లీడ్ రోల్‌కు ఖరారైంది. తాజాగా ఆమె చేతిలోకి మరో క్రేజీ బాలీవుడ్ మూవీ వచ్చింది. తమిళం, తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’కి హిందీలో రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ ఇందులో లీడ్ రోల్ చేయనున్నాడు. ఈ చిత్రానికి కాజల్ కథానాయికగా ఎంపికైంది. అజయ్‌తో ఇంతకుముందే ఆమె ‘సింగం’ సినిమాలో నటించింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. మళ్లీ ‘ఖైదీ’ రీమేక్‌లో అజయ్, కాజల్ జోడీని చూడబోతున్నాం.
ఐతే ‘ఖైదీ’లో హీరోయిన్ పాత్రే కనిపించదు. హీరో భార్య చనిపోయినట్లు మాటల్లో చెబుతారే కానీ.. ఆ పాత్ర తెరపై కనిపించదు. దాన్ని ‘ఖైదీ’ సీక్వెల్లో చూపించే స్కోప్ మాత్రం కనిపించింది. మరి ఒరిజినల్లో అస్సలు ఒక్క సీన్ కూడా లేని పాత్రను కాజల్ ఎలా ఒప్పుకుందన్నది సందేహం. ఐతే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటపుడు హిందీలో మార్పులు చేర్పులు చాలా జరుగుతుంటాయి. బహుశా హీరోయిన్ పాత్రతో ఒక ఫ్లాష్ బ్యాక్‌ను నడిపించబోతున్నారేమో. ఈ క్రమంలోనే కాజల్‌కు ఆ పాత్రను ఆఫర్ చేసినట్లు భావించొచ్చు.
This post was last modified on June 9, 2021 3:18 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…