బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గతంలో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. రణబీర్ ని కత్రినా పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ జంట విడిపోయింది. ఆ తరువాత చాలాకాలం పాటు డిప్రెషన్ లో ఉన్న కత్రినా మళ్లీ తన కెరీర్ మీద ఫోకస్ పెట్టి సినిమాలతో బిజీ అయింది. ఇదిలా ఉండగా.. కత్రినా కొన్నాళ్లుగా హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తుందంటూ బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. ‘ఉరి’ సినిమాతో పాపులర్ అయిన విక్కీ కౌశల్ తో కత్రినా పలు సందర్భాల్లో సన్నిహితంగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొన్ని పండగలు కూడా ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవారు. దీంతో ఈ జంటలో ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే తమ రిలేషన్ పై ఎప్పుడూ వీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఓ బాలీవుడ్ నటుడు వీరి రిలేషన్ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు. ప్రముఖ సీనియర్ నటుడు అనీల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. విక్కీ కౌశల్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
ఈ క్రమంలో ఆయన విక్కీ కౌశల్, కత్రినా డేటింగ్ చేస్తున్న మాట నిజమేనని క్లారిటీ ఇచ్చారు. వెంటనే ”ఇలా చెప్పినందుకు నేనేమైనా ఇబ్బందుల్లో పడతానేమో నాకు తెలియదు కానీ.. ఈ విషయంలో వాళ్లు చాలా ఓపెన్ గా ఉన్నారని నేను అనుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చారు. గతంలో విక్కీని తన డేటింగ్ లైఫ్ గురించి ప్రశ్నించినప్పుడు.. తన వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు మాట్లాడడం తనకు నచ్చదని స్పష్టం చేశారు. మరి ఇప్పుడు హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ పై విక్కీ, కత్రినా ఎలా స్పందిస్తారో చూడాలి!
This post was last modified on June 9, 2021 2:58 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…