బాహుబలి తర్వాత దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో భారీ చిత్రాన్నే లైన్లో పెట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఐతే బాహుబలిలా దీనికి మరీ టైం తీసుకోకుండా సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనుకున్నాడు కానీ.. ఆయనకు కాలం కలిసి రావడం లేదు. తాను చేసిన ఆలస్యం వల్ల ఒకసారి సినిమా వాయిదా పడితే.. కరోనా కారణంగా మరింత జాప్యం తప్పట్లేదు. గత ఏడాది ఆరేడు నెలల పాటు చిత్రీకరణ ఆపేయడంతో 2021 జనవరి నుంచి అక్టోబరు 13కు సినిమాను వాయిదా వేశారు.
కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని మళ్లీ ఈ ఏడాది కూడా షూటింగ్‌కు బ్రేక్ పడి.. డెడ్ లైన్‌ను అందుకోవడం సందేహంగానే ఉంది. అక్టోబరు 13కు సినిమా రిలీజ్ కావడం అసాధ్యమే అని చిత్ర బృందం తాజాగా ఒక నిర్ణయానికి వచ్చేసిందట. కొత్త డేట్ కోసం ఆలోచన చేస్తున్నారట.
ఐతే అక్టోబరు 13 నుంచి సినిమా వాయిదా వేస్తున్నట్లు ముందు ప్రకటించి.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే విషయంలో వేచి చూడాలని జక్కన్న అండ్ కో భావిస్తున్నట్లు సమాచారం. కరోనా తగ్గుముఖం పట్టినా దేశవ్యాప్తంగా థియేటర్లు ఏడాదిన్నర కిందట్లా పూర్తి స్థాయిలో నడవడానికి చాలా సమయం పట్టొచ్చని, ఎలాగూ ఆలస్యం జరిగింది కాబట్టి ఈసారి డేట్ ప్రకటించే విషయంలో తొందర పడకూడదని భావిస్తున్నారట.
సంక్రాంతి సమయానికి కూడా ఒకప్పటి ఊపు ఉండకపోవచ్చని, అందుకే 2022 వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదని భావిస్తున్నారట. మిగతా సన్నివేశాల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఆరు నెలలకు పైగానే సమయం పట్టేలా ఉండటం కూడా సంక్రాంతి పట్ల అనాసక్తి కారణమని, మళ్లీ కొత్త అవాంతరాలేమైనా వస్తే తప్ప 2022 వేసవికి ఆర్ఆర్ఆర్ విడుదల కావడం పక్కా అని చిత్ర వర్గాల సమాచారం. ఇదే నిజమైతే రాజమౌళి చివరి సినిమా బాహుబలి-2 వచ్చిన ఐదేళ్ల తర్వాత ఆయన తర్వాతి సినిమా విడుదల కానుందన్నమాట.
This post was last modified on June 9, 2021 6:46 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…