‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ హిట్ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు బుచ్చిబాబు సానా. ఈ సినిమా యాభై కోట్ల మైలు రాయిని అందుకుంది. దీంతో బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమాను నిర్మించిన మైత్రి సంస్థ బుచ్చిబాబుతో మరో సినిమా ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ హీరోగా సినిమా అనుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు బుచ్చిబాబు.. అల్లు అర్జున్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా బుచ్చిబాబు.. అల్లు కాంపౌండ్ లో కనిపించారు. బన్నీతో కథా చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ కాంబినేషన్ ను కూడా మైత్రి మూవీస్ సంస్థే తెరపైకి తీసుకొచ్చిందని టాక్. అంటే ఎన్టీఆర్ కి బదులుగా బన్నీతో చేయాలనుకుంటున్నారా..? లేక బన్నీ కోసం ప్రత్యేకంగా కథ రెడీ చేసుకున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దీన్ని బట్టి ఇప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ దొరికే ఛాన్స్ లేదు.
అందుకే బుచ్చిబాబు ఇతర హీరోల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీను కలిసినట్లు తెలుస్తోంది. నిజానికి ‘పుష్ప’ తరువాత బన్నీ తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చాలా మంది దర్శకులు బన్నీను కలిసి కథలు వినిపిస్తున్నారు. అలానే బుచ్చిబాబు కూడా ఓ లైన్ చెప్పడానికి వెళ్లారట. ఇప్పటికే బన్నీ లిస్ట్ లో బోయపాటి శ్రీను, వేణుశ్రీరామ్ లాంటి దర్శకులు ఉన్నాయి. ఇప్పుడు అదే లిస్ట్ లో బుచ్చిబాబు కూడా చేరారు. మరి వీరందరిలో బన్నీ ముందుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి!
This post was last modified on June 8, 2021 5:35 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…