‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది మెహ్రీన్. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వచ్చాయి. శర్వానంద్, రవితేజ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో వెండితెరపై రొమాన్స్ చేసింది. స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రానప్పటికీ మీడియం రేంజ్ హీరోలతో జత కడుతూ కాస్త క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి సినిమా ఆఫర్లు రావడం లేదు.
ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్ 3’ తప్ప మరో తెలుగు సినిమా లేదు. దీంతో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంది. భవ్య బిష్ణోయ్ అనే యంగ్ పొలిటికల్ లీడర్ తో పెళ్లికి రెడీ అయింది. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ కోవిడ్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది మెహ్రీన్. ఈ క్రమంలో ఓ కుర్ర హీరోతో కలిసి నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ’తో సక్సెస్ అందుకున్న సంతోష్ శోభన్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమా ప్లాన్ చేశారు. ముప్పై రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు మారుతి. లాక్ డౌన్ లో ఈ చిన్న సినిమాకి శ్రీకారం చుట్టారు. సైలెంట్ గా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. అతి తక్కువ మంది సిబ్బందితో షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ కనిపించనుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు మెహ్రీన్ మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తొలిసారి వయసులో తనకంటే చిన్నవాడైనా సంతోష్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. అవకాశాలు రాకే ఆమె ఈ సినిమా ఒప్పుకొని ఉంటుందని అంటున్నారు. మరి వెండితెరపై ఈ కాంబినేషన్ లో ఎలా ఉంటుందో చూడాలి. మరోపక్క మారుతి.. గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను ప్లాన్ చేశారు. లాక్ డౌన్ పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభిస్తారు.
This post was last modified on June 8, 2021 11:40 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…