సినీ మహాకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఏళ్లుగా తన సాహిత్యంతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ తరం వాళ్లను కూడా ఆయన తన పాటలతో అల్లుకుపోతున్నారు. ‘జాను’ సినిమాలో ఆయన రాసిన ‘లైఫ్ ఆఫ్ రామ్’ పాట శ్రోతలను ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇలాంటి పాటలు ఆయన కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. పాటల ప్రపంచంలోనే గడిపే సిరివెన్నెల గతేడాది ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది కావొస్తున్న సందర్భంగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ముందుగా ఓ నెటిజన్ ‘అప్పట్లో ఉన్న పాటలు సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు గురువు గారు?’ అని ప్రశ్నించగా.. దానికి సిరివెన్నెల.. ‘ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్నిరకాలుగానూ, ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం’ అంటూ బదులిచ్చారు.
మరో నెటిజన్ ‘త్రివిక్రమ్ గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం ఏంటి గురువు గారూ…?’ అని ప్రశ్నించారు. వెంటనే సిరివెన్నెల ‘మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు’ అంటూ చెప్పుకొచ్చారు. తనకు బాగా నచ్చే పుస్తకం.. ఒకటి- భగవద్గీత, రెండు- ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ద ప్రాఫిట్’ అని చెప్పారు. తనకు బాగా నచ్చే కవి ‘వాల్మీకి’ అని తెలిపారు. ఇన్నేళ్ల తన సాహిత్య ప్రయాణంలో ప్రయోగించిన, గర్వించదగ్గ పదం లేదా వాక్యంపై స్పందిస్తూ.. ”ప్రశ్న – కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటపడే ప్రశ్న” అంటూ చెప్పుకొచ్చారు.
This post was last modified on June 6, 2021 2:34 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…