రక్షిత్ శెట్టి.. పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో మంచి పేరున్న ఈ యువ నటుడి గురించి బయటి రాష్ట్రాల వాళ్లకు కూడా తెలియడానికి కారణం రష్మిక మందన్నా. ఆమె తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’లో హీరో రక్షితే. ఆ సినిమా స్క్రిప్టులోనూ అతడి భాగస్వామ్యం ఉంది. ఆ చిత్ర నిర్మాత కూడా అతనే.
ఈ సినిమా చేస్తున్నపుడే రష్మిక, అతను ప్రేమలో పడటం.. వెంటనే నిశ్చితార్థం కూడా చేసుకోవడం.. రెండేళ్లు కలిసి సాగడం.. చివరికి ఇద్దరికీ సరిపోక నిశ్చితార్థం రద్దు చేసుకోవడం తెలిసిందే. ఐతే బయటి వాళ్లలో మాత్రం రక్షిత్‌కు రష్మిక ఎక్స్‌గా అతడికి గుర్తింపు కొనసాగుతుండొచ్చు కానీ.. కన్నడ పరిశ్రమలో మాత్రం రక్షిత్‌కు నటుడిగా, నిర్మాతగా మంచి పేరే ఉంది. ఒక మూసలో సినిమాలు తీస్తూ బాగా వెనుకబడ్డట్లు కనిపించే కన్నడ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఆ మార్పులో రక్షిత్ కూడా భాగమే.
‘కిరిక్ పార్టీ’ తరహాలోనే అతను కొత్త తరహా సినిమాలతో సాగుతున్నాడు. తెలుగులోకి అనువాదం అయిన ‘అతడే శ్రీమన్నారాయణ’ కూడా ఇందులో భాగమే. ఇప్పుడు ‘777 చార్లీ’ పేరుతో మరో వినూత్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రక్షిత్. ఇది ఒక కుక్క చుట్టూ తిరిగే కథ కావడం విశేషం. ఆదరణ కోల్పోయి తిండి, తలదాచుకోవడానికి చోటు దొరక్క ఎలా పడితే అలా తిరిగేస్తున్న ఒక వీధి కుక్కను ఒక కుర్రాడు చేరదీశాక తలెత్తే పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.
ఈ రోజు రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా దీని టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో టైటిల్ రోల్ కుక్కదే కావడం విశేషం. టీజర్ మొత్తం ఆ కుక్క చుట్టూనే తిరిగింది. తిండి కోసం ఆ కుక్క పడే కష్టాలను చూపించి, చివరగా ధర్మ అనే హీరో చార్లీని తీసుకెళ్తున్న దృశ్యం చూపించారు. ధర్మను చార్లీ కలిశాక జరిగే ఉత్కంఠభరిత ప్రయాణమే ఈ సినిమా అని సంకేతాలు ఇచ్చారు. రక్షితే నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ రాజ్ రూపొందిస్తున్నాడు. ‘777 చార్లీ’ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయబోతుండటం విశేషం.
This post was last modified on June 6, 2021 12:35 pm
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…
'పద్మ శ్రీ' వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు…
ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు…
2000 తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. తొలి సినిమా ‘చెలి’ మొదలుకుని.. మూడేళ్ల…