Movie News

మైనర్ రేప్ కేసులో టీవీ నటుడు

సినిమాల్లో, టీవీ షోల్లో వెలిగిపోవాలని ఆశపడే అమ్మాయిల నుంచి అడ్వాంటేజ్‌గా తీసుకుని వారి నుంచి సెక్సువల్ ఫేవర్లు కోరడం.. వేధించడం లాంటి ఉదంతాల గురించి తరచూ వింటుంటాం. ఇలాంటి వాటి గురించి గతంలో బహిరంగ చర్చ జరిగేది కాదు. అమ్మాయిలు వీటి గురించి నోరు విప్పడమూ తక్కువే.

ఐతే మూడేళ్ల కిందట ‘మీ టూ’ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అమ్మాయిలు తమపై జరిగే అఘాయిత్యాలు, వేధింపుల గురించి బయటికి చెప్పడానికి కాస్త ధైర్యం చేస్తున్నారు. కేసులు కూడా పెడుతున్నారు. ఇటీవలే భార్గవ్ అనే యూట్యూబర్ వల్ల గర్భం దాల్చిన ఓ మైనర్ బాలిక కేసు పెట్టడం తెలిసిందే. ఇప్పుడు హిందీ టీవీ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన పెర్ల్ వి.పూరి అనే ఆర్టిస్టు ఇలాంటి ఆరోపణలతోనే అరెస్టయ్యాడు. ఓ మైనర్ బాలిక పెట్టిన రేప్ కేసులో భాగంగా ముంబయి పోలీసులు పెర్ల్‌ను శనివారం అరెస్టు చేశారు.

టీవీ కార్యక్రమాల్లో అవకాశాల కోసం పెర్ల్‌ను కలిస్తే అడ్వాంటేజ్ తీసుకుని తనను లైంగికంగా వాడుకున్నాడని, అత్యాచారం జరిపాడని ఓ మైనర్ బాలిక పెర్ల్ మీద ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పెర్ల్ మీద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద కేసు పెట్టి అతణ్ని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పెర్ల్‌తో పాటు ఇంకో ఐదుగురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

నాగిన్ 3, నాగార్జున ఏక్ యోధా, నజర్ సే కుబ్‌సూరత్, బేపనా ప్యార్ లాంటి టీవీ కార్యక్రమాలతో పెర్ల్ వి.పూరి పాపులర్ అయ్యాడు. టీవీ ఇండస్ట్రీలో అతను పెద్ద స్టార్ అనే చెప్పాలి. ఇంత పేరున్న నటుడు ఇలా మైనర్ బాలిక రేప్ కేసులో అరెస్ట్ కావడం అభిమానులకు మింగుడు పడటం లేదు. ఐతే నాగిన్ 3లో పెర్ల్ కోస్టార్ అయిన అనిత హస్సానందని మాత్రం.. పెర్ల్ చాలా మంచోడని, అతడిపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని పేర్కొంటూ ట్వీట్ వేసి అతడికి మద్దతుగా నిలిచింది. ఇండస్ట్రీలో మిగతా వాళ్లు పెర్ల్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on June 5, 2021 7:19 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

40 minutes ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

1 hour ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

2 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

3 hours ago