సరైన సినిమా పడితే.. టెక్నీషియన్లు, ఆర్టిస్టుల కెరీర్లు ఎలా మారిపోతాయనడానికి బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలే ఉదాహరణ. ‘బాహుబలి’ అయినా అప్పటికే గొప్ప పేరున్న రాజమౌళి తీసింది. కానీ ‘కేజీఎఫ్’ సినిమాను తెరకెక్కించింది మాత్రం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న ప్రశాంత్ నీల్. ‘ఉగ్రం’ అనే సూపర్ హిట్ మూవీతో ఈ కన్నడ దర్శకుడు అరంగేట్రం చేశాడు.
ఐతే అది మంచి సినిమానే కానీ.. కన్నడ పరిశ్రమను దాటి ప్రశాంత్ ప్రతిభను బయటి వాళ్లకు పరిచయం చేసే స్థాయి చిత్రమైతే కాదు. కానీ ప్రశాంత్ తీసిన రెండో సినిమా ‘కేజీఎఫ్’ మాత్రం అతడిని పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌ని చేసింది. ఈ సినిమా చూసి వివిధ భాషల వాళ్లు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులే కాక ఇక్కడి హీరోలు, నిర్మాతలు ప్రశాంత్ పనితీరుకు ముగ్ధులైపోయారు. ఇప్పటికే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్లు అతడితో సినిమాలు ఓకే చేసుకున్నారు. అల్లు అర్జున్ సైతం లైన్లో ఉన్నాడు.
‘కేజీఎఫ్’తో ఇంతగా పేరు సంపాదించిన ప్రశాంత్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడితో ‘కేజీఎఫ్’.. ‘సలార్’ చిత్రాలు నిర్మిస్తున్న హోంబలె ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను రూపొందించింది. ‘కేజీఎఫ్’ మేకింగ్ సందర్భంగా ప్రశాంత్ తన టీంతో కలిసి ఎంత ఉత్సాహంగా పని చేస్తున్నాడో చూపించే వీడియో ఇది. కన్నడ నేల నుంచి పుట్టిన ఈ దర్శకుడు.. ‘ది బెస్ట్’ అనిపించుకున్నాడని.. తన టీంలో ప్రతి ఒక్కరి నుంచి ‘ది బెస్ట్’ రాబడతాడని అతడికి ఎలివేషన్ ఇస్తూ ఈ వీడియో సాగింది.
ప్రశాంత్ గురించి ‘కేజీఎఫ్’ హీరో యశ్ చేసిన వ్యాఖ్యలను సైతం దీనికి జోడించారు. ప్రశాంత్ ప్రతిభ విషయంలో ‘కేజీఎఫ్’ ఆరంభం మాత్రమే అని.. అతడి నుంచి ఇంకా చాలా చూడబోతున్నారని.. అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయని యశ్ వ్యాఖ్యానించాడు. ప్రశాంత్ ఒక హాలీవుడ్ సినిమాను తెరకెక్కిస్తే చూడాలని తన కోరిక అని, ఆ సామర్థ్యం అతడికి ఉందని కూడా యశ్ అన్నాడు. ప్రశాంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు బాగా పరిచయం కావడంతో.. అందరూ ఈ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు.
This post was last modified on June 4, 2021 2:13 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…