యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన తరువాత మోహన్ రాజా రూపొందించనున్న ‘లూసిఫర్’ రీమేక్ లో నటించనున్నారు. ఆ తరువాత బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు చిరు. అయితే ముందుగా ‘లూసిఫర్’ రీమేక్ ను పూర్తి చేస్తారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకాగా.. తాజాగా క్యాస్టింగ్ పనులను మొదలుపెట్టారని తెలుస్తోంది.
ఈ క్రమంలో మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలో చాలా మంది పేరున్న నటులకు కాల్స్ వెళ్లాయి. హీరో వరుణ్ తేజ్ ను కూడా సినిమాలో కీలకపాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మలయాళ వెర్షన్ లో నటుడు టోవినో థామస్ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. విదేశాల నుండి ఇండియాకు తిరిగొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేసే పాత్ర అది. ముందు ఈ రోల్ కోసం విజయ్ దేవరకొండను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని అప్పట్లో విజయ్ క్లారిటీ ఇచ్చారు.
వరుణ్ తేజ్ ని తీసుకోవడం ద్వారా ప్రాజెక్ట్ కి హైప్ మరింత వస్తుందని భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలకు చిరంజీవితో కలిసి పని చేయాలనేది కోరిక. వరుణ్ తేజ్ కూడా ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు. కాబట్టి మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా వదులుకోరని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గని’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. అలానే మరికొన్ని ప్రాజెక్ట్ లను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.
This post was last modified on June 4, 2021 9:15 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…