ఇంకొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్. దీని కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఇందులో సమంత పోషించిన పాత్ర తమిళ టైగర్లను పోలి ఉండగా.. వారిని టెర్రరిస్టులుగా చూపించడం తమిళులకు నచ్చట్లేదు. దీనిపై ట్రైలర్ రిలీజైనపుడే తమిళులు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో నిరసన తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కేంద్రానికి విజ్ఞప్తులు వెల్లాయి.
ఐతే నిషేధం దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. కాగా సిరీస్ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండగా. . ఈ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ టీం కూడా మళ్లీ ఎక్కడ బ్యాన్ డిమాండ్లు వస్తాయో అని ప్రమోషన్ల హడావుడి ఏమీ లేకుండా.. సైలెంటైపోయింది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రిలీజ్‌కు మధ్యలో ఒక్క రోజే మిగిలుండటంతో గుంభనంగా ఉన్నారంతా.
కానీ వాళ్లు సైలెంటుగా ఉన్నప్పటికీ తమిళ జనాలు ఊరుకోలేదు. ఈ విషయాన్ని వాళ్లు తేలిగ్గా వదిలేయాలనుకోవట్లేదు. మరోసారి ట్విట్టర్ ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. #Shameonsamantha అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దాన్ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. సమంతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు తమిళ నెటిజన్లు. తమిళనాట పుట్టి ఇక్కడే పెరిగిన సమంత ఇలాంటి పాత్ర ఎలా చేసిందని.. ఆమెకు కొంచెం కూడా బాధ్యత లేదని.. తమిళులను కించపరిచే పాత్ర చేసినందుకు సిగ్గు పడాలని.. ఇక్కడి పరిశ్రమలో ఎదిగి ఇలా ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.
‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్ అనే కాక ఇకపై సమంత చేసే సినిమాలన్నింటినీ బహిష్కరించాలని.. ఆమెకు తమిళ సినిమాల్లో అవకాశాలే ఇవ్వకూడదని నెటిజన్లు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. మరి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రిలీజ్ తర్వాత వీరి అభిప్రాయాలు ఎలా ఉంటాయో.. ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
This post was last modified on June 3, 2021 9:43 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…