ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే సినిమా చేసి పెద్ద రేంజికి వెళ్లినప్పటికీ.. గతంతో పోలిస్తే మార్కెట్ బాగా దెబ్బ తిన్న నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. తాను బాలయ్యకు వీరాభిమానినని, ఆయనతో సినిమా చేయడం తన కల అని కెరీర్ ఆరంభం నుంచి చెబుతూనే వస్తున్నాడు అనిల్.
గతంలో ‘రామారావు’ పేరుతో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైన అతను.. ఇప్పుడు తన కలను నెరవేర్చుకోవడానికి చాలా దగ్గరగానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. బాలయ్య కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నానని, త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాల్చొచ్చని కొన్ని రోజుల కిందటే ఓ ఇంటర్వ్యూలో అనిల్ ధ్రువీకరించాడు కూడా. కాకపోతే ఆ సినిమా సరిగ్గా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలోనే స్పష్టత లేదు.
కాగా అనిల్-బాలయ్య కాంబినేషన్లో సినిమాకు నిర్మాతలు కూడా రెడీ అయిపోయారని, అతి త్వరలోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రకటించనున్నారని సమాచారం. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం గురించి ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్ ఉంటుందట. మజిలీ, టక్ జగదీష్ చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. బాలయ్య-అనిల్ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చిన వీళ్లకు పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్‌తో ఇదే తొలి సినిమా కానుంది. తన వల్ల నష్టపోయినందుకే హరీష్, సాహులకు అనిల్ ఈ సినిమా చేస్తున్నట్లు సమాచారం.
అనిల్ స్క్రిప్టు, అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన ‘గాలి సంపత్’ను హోల్‌సేల్‌గా కొనేసి రిలీజ్ చేసింది షైన్ స్క్రీన్స్ అధినేతలే. అనిల్ మిత్రుడు నిర్మించిన ఈ చిత్రం.. నష్టం తెచ్చిపెట్టింది. మరి బాలయ్యతో సినిమా తమ బేనర్లో చేస్తున్నందుకు ‘గాలి సంపత్’ను రిలీజ్ చేశారా.. లేక దాని వల్ల నష్టపోయినందుకు బాలయ్య సినిమాను ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని అనిల్ వీళ్లకు ఇచ్చాడా అన్నది తెలియదు కానీ.. ఇదైతే ఒక రకంగా సెటిల్మెంట్ మూవీనే అన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
This post was last modified on June 3, 2021 9:43 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…