‘మన్మథుడు’ సినిమాను తలుచుకుంటే అక్కినేని నాగార్జున అభిమానులకు ఒక పులకింత కలుగుతుంది. ఆ సినిమా వచ్చి రెండు దశాబ్దాలవుతున్నప్పటికీ.. ఇప్పుడు చూసినా ఆద్యంతం అలరించే చిత్రమది. నాగ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనొచ్చు ‘మన్మథుడు’ను. ఈ సినిమా ఫలానా హీరో మాత్రమే చేయగలడు, ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేం అనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. నాగ్ కెరీర్లో ‘మన్మథుడు’ అలాంటి చిత్రాల్లో ఒకటి. అంతగా ఆకట్టుకున్న ఆ చిత్రానికి 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించాడు.
కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం.. దారుణమైన ఫలితాన్నందుకుంది. ‘చి ల సౌ’ లాంటి మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ నుంచి ఇలాంటి సినిమాను ఎవరూ ఊహించలేదు.
ఐతే ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి దీని విషయంలో ఎప్పటికప్పుడు రిగ్రెట్ అవుతూనే ఉన్నాడు రాహుల్. నాగ్ అభిమానులకు పలుమార్లు సారీ కూడా చెప్పాడు. తాజాగా అతను ట్విట్టర్లో తనే హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఒక స్పేస్ పెట్టాడు. ఇందులో ‘మన్మథుడు-2’ ప్రస్తావన వచ్చినపుడు.. ఆ చిత్రంలో ఎక్కడ తేడా జరిగిందో ఉదాహరణగా ఓ సన్నివేశం గురించి చెప్పాడు. సినిమా మొదలైన 20 నిమిషాలకు నాగ్ ఒక అమ్మాయితో ఘాటు రొమాన్స్ చేసే సన్నివేశం అది. ఆ సమయంలో రూం షేక్ అయిపోతున్నట్లుగా చూపిస్తారు. ఈ సన్నివేశం చూసి నాగ్ అభిమానులందరం తట్టుకోలేకపోయామని ఓ నెటిజన్ అంటే.. ఆ సీన్ తీసేటపుడు తాము నవ్వుకున్నామని, కానీ థియేటర్లో జనాల రెస్పాన్స్ చూస్తే తాము చేసింది ఎంత పెద్ద తప్పో అర్థమైందని రాహుల్ అన్నాడు.
ఆ సన్నివేశం దగ్గరే ప్రేక్షకులు సినిమా పట్ల వ్యతిరేక బావానికి వచ్చేశారని, అలాంటి సీన్ తర్వాత తాము ‘శంకరాభరణం’ చూపించినా వాళ్ల అభిప్రాయం మారదని.. సినిమాలో ఆ సీన్ పెద్ద బ్లండర్ అయిందని రాహుల్ అంగీకరించాడు. ఒక నెటిజన్ ‘మన్మథుడు-2’ బ్యాడ్ మూవీ ఏమీ కాదని ఏదో అనబోతుంటే. రాహుల్ అందుకుని ఇలాంటి పాజిటివ్ కామెంట్లు చేయకండి, మళ్లీ నాగ్ ఫ్యాన్స్ తనను తగులుకుంటారని చెప్పడం విశేషం.
This post was last modified on June 1, 2021 3:22 pm
ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ…
దేశంలో `వన్ నేషన్-వన్ ఎలక్షన్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్రం తలపోస్తున్న విషయం తెలిసిందే. దీనిపై…
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…
టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…
మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…
సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని..…