Movie News

ఎన్టీఆర్ అభిమానులు వదిలిపెడతారా?

తమ ఆరాధ్య కథానాయకులను ఎవరైనా ఏమైనా అంటే, తక్కువ చేసి మాట్లాడితే అభిమానులు తట్టుకోలేరు. అందులోనూ ఇది సోషల్ మీడియా కాలం ఆయె. అలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని దారుణంగా ట్రోల్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను గతంలో బాలీవుడ్ భామ మీరా చోప్రా ఇలాగే హర్ట్ చేసింది.

ఆమె ట్విట్టర్లో తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తుంటే.. ఒక నెటిజన్ ఎన్టీఆర్ గురించి చెప్పమని అడగడం, అందుకామె అతనెవరు అని ప్రశ్నించడం.. తర్వాత ఎన్టీఆర్ అభిమానుల వేలకొద్దీ వచ్చి ఆమెను ట్రోల్ చేయడం.. మీరా వాళ్లపై సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఇష్యూ సీరియస్ అయిపోవడం.. ఇదో పెద్ద వివాదంగా మారడం తెలిసిందే. ఆ వ్యవహారంలో చివరికి మీరాదే పైచేయి అయింది. ఎన్టీఆర్ అభిమానులు తగ్గాల్సి వచ్చింది. ఐతే మీరా మళ్లీ ఎప్పుడు దొరుకుతుందా అని అప్పట్నుంచి ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్.

ఇప్పుడు మీరా చోప్రా ఒక వివాదంతో వార్తల్లో నిలిచిింది. ఆమె వ్యాక్సినేషన్ చేయించుకోవడం కోసం హెల్త్ వర్కర్ లాగా ఫేక్ ఐడీ క్రియేుట్ చేసిందని.. దాని ద్వారానే మిగతా సెలబ్రెటీల కంటే ముందు టీకా వేయించుకుందని ఆరోపణలు వస్తున్నాయి. మీరా ఫొటోతో ఉన్న ఫేక్ ఐడీ సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇక అంతే నెటిజన్లు ఆమెను గట్టిగా తగులుకున్నారు. ఇదే ఛాన్స్ అన్నట్లు ఎన్టీఆర్ అభిమానులు కూడా రంగంలోకి దిగిపోయారు. ఒకప్పటి వివాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మీరాను దారుణంగా ట్రోల్ చేశారు.

ఐతే ఈ విషయమై మీరా కొంచెం ఆలస్యంగా స్పందించింది. తాను కష్టపడి నెల రోజులు ప్రయత్నిస్తే చివరికి టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగానని, ఆ ప్రకారమే తాను టీకా వేయించుకున్నానని.. అంతే తప్ప ఫేక్ ఐడీ క్రియేట్ చేశానన్నది అబద్ధమని స్పష్టం చేసింది. ఆ ఐడీలో తన సిగ్నేచర్ కూడా లేదని, అలాంటపుడు ఆ ఐడీ తాను క్రియేట్ చేసినట్లు ఎలా భావిస్తారని ఆమె ప్రశ్నించింది. ఐతే ఇందులో ఏది నిజమో ఏమో కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఒక రోజంతా మీరాను ట్రోల్ చేసి కాస్త ఉపశమనం పొందారు.

This post was last modified on June 1, 2021 12:48 pm

Share

Recent Posts

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

1 hour ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

4 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

4 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

6 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

8 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

9 hours ago