అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న ఈ సిరీస్ కోసం ఫ్యామిలీ మ్యాన్ టీమ్ భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. దర్శకుడు రాజ్, డీకే తో పాటు సమంత కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. నేషనల్ వైడ్ గా ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తున్నారు. మే రెండో వారంలో సమంత కొన్ని బాలీవుడ్ పోర్టల్స్ కు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నారు.
దర్శకనిర్మాతలు సిరీస్ కు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని సమంతకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో సమంత టెర్రరిస్ట్ పాత్రలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళుల హక్కుల కోసం పోరాడిన వారిని ఇందులో టెర్రరిస్ట్ లుగా చూపిస్తున్నారంటూ తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. తమిళమ్మాయి అయిన సమంత ఈ సిరీస్ లో నటించడాన్ని తప్పుబడుతున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ఆమెను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు.
ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సమంత ప్రమోషన్స్ లో పాల్గొంటే పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని భావించిన దర్శకనిర్మాతలు ఆమెని ప్రమోషన్స్ కు దూరంగా ఉంచుతున్నారు. సమంత కూడా ఈ వివాదంలో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదట. కానీ ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడ్డారు. అందుకే ప్రమోషన్స్ లో అత్యుత్సాహంతో పాల్గొన్నారు. ఈ సిరీస్ తో బాలీవుడ్ లో పాపులర్ కావాలనుకున్న సమంతకు కనీసం ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే సిరీస్ రిలీజైన తరువాత ఎలాగో హిట్ టాక్ వస్తుందని.. అప్పుడు మళ్లీ మీడియా ముందుకు వెళ్లొచ్చని సమంత భావిస్తున్నారట!
This post was last modified on June 2, 2021 6:08 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…