చాలా ఏళ్లుగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కావాలని చూస్తున్నారు మల్లిడి వేణు. గతంలో హీరో నితిన్, రామ్ లాంటి వాళ్లకు కథలు చెప్పారు. కానీ వర్కవుట్ కాలేదు. 2016లో అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమాను లాంచ్ కూడా చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. దానికి బడ్జెట్ సమస్యలే కారణమని సమాచారం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలనుకున్నారు.
ఏడెనిమిది వందల ఏళ్ల కిందటి నేపథ్యంలో కథ ఉంటుందని అప్పట్లో అల్లు శిరీష్ చెప్పారు ముందుగా అల్లు శిరీష్ మార్కెట్ పరిధుల్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమా కోసం ఓ భారీ దర్బార్ సెట్ కూడా వేయాలనుకున్నారు. కానీ అనుకున్నదానికంటే బడ్జెట్ దాటిపోయే అవకాశం ఉందని భావించిన అల్లు అరవింద్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేశారు. అప్పటినుండి మల్లిడి వేణు హీరోల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ఓకే అయింది. వశిష్ట్ గా పేరు మార్చుకొని సినిమా అనౌన్స్ చేశారు మల్లిడి వేణు. అదే ‘బింబిసార’.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి చిన్న టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విజువల్స్ చూసిన ఇండస్ట్రీకి చెందిన కొందరు.. ఇది అల్లు శిరీష్ కోసం అనుకున్న కథే అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అప్పటి కథనే ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో తీస్తున్నారా..? లేక మరో హిస్టారికల్ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నారా..? అనే విషయంపై దర్శకుడు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!
This post was last modified on May 29, 2021 7:51 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…