స్టార్ హీరోలు చిన్న దర్శకులతో కలిసి పని చేయడానికి చాలా ఆలోచిస్తారు. చెప్పినట్లుగా కథను హ్యాండిల్ చేయగలరా..? అనే సందేహంతో ఉంటారు. రిస్క్ తీసుకోవడం ఎందుకని.. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసుకుంటూ పోతారు. అందుకే చిన్న దర్శకులకు అంత త్వరగా అవకాశాలు రావు. కానీ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లాంటి పేరున్న హీరో ఓ చిన్న దర్శకుడితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన దర్శకుడు వెంకటేష్ మహాకి వెంకీ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంట. అయితే ఇది థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రం కాదట. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ మంచి బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాండమిక్ పరిస్థితులు చక్కబడిన తరువాత దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ఇటీవల వెంకీ ‘నారప్ప’ షూటింగ్ ను పూర్తి చేశారు. అలానే ‘దృశ్యం2’, ‘ఎఫ్2’ లాంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవి పూర్తయిన వెంటనే.. మహాతో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు వెంకీ.
This post was last modified on May 29, 2021 7:41 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…