బాలనటుడిగా గొప్ప పేరు సంపాదించి.. హీరోగా తొలి చిత్రం ‘నువ్వే కావాలి’తో బ్లాక్ బస్టర్ అందుకుని.. ఆపై ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను లాంటి సూపర్ హిట్లతో ఊపు మీద కనిపించాడు తరుణ్ ఒకప్పుడు. యూత్‌లో అతడికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. తరుణ్ పెద్ద స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు.
కానీ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోక గాడి తప్పాడు ఈ యంగ్ హీరో. వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చి ఫేడవుట్ అయిపోయాడు. గత దశాబ్ద కాలంలో అతను రెండో మూడో సినిమాలు చేశాడు. అవి రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. చివరగా ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే సినిమా చేయగా.. అది చూసిన ప్రేక్షకులకు తలలు బొప్పి కట్టాయి. ఈ దెబ్బతో అతడి కెరీర్ క్లోజ్ అయిపోయింది. తరుణ్ హీరోగా మొదలైన కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోగా.. కొత్తగా అతడితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
జనాలు పూర్తిగా తరుణ్‌ను మరిచిపోయిన ఈ సమయంలో అతను కొత్త అవతారం ఎత్తాడు. ఆశ్చర్యకరంగా తరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. అది కూడా ఏదో ఒక పెద్ద తమిళ సినిమాకైనా ఓకే అనుకోవచ్చు. ‘ఆహా’ ఓటీటీలో రిలీజైన ‘అనుకోని అతిథి’ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ చేసిన లీడ్ రోల్‌కు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. ఇది రెండేళ్ల కిందటి ‘అతిరన్’ సినిమాకు డబ్బింగ్ వెర్షన్.
ఆహా ఓటీటీ పెట్టినప్పటి నుంచి ఎక్కువగా మలయాళం సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ రేటుకు డబ్బింగ్ హక్కులు తీసుకుని, పరిమిత ఖర్చుతో డబ్బింగ్ చేయించి ప్రిమియర్స్ వేసుకుంటున్నారు. ఈ కోవలో వచ్చిన చిత్రానికి తరుణ్ డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం. నటుడిగా ఇక తనకు కెరీర్ లేదనుకుని బేషజాలు లేకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాలని తరుణ్ అనుకుని ఉండొచ్చు. అది మంచి నిర్ణయమే కావచ్చు. కానీ ఆ మార్గం ఎంచుకున్నా సరే.. కొంచెం స్థాయి చూసుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 28, 2021 5:40 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…